రీసెంట్ గా గత డిసెంబర్ లో నెలలో పలు కారణాలు చేత పలు చిత్రాలు ఒక డేట్ నుంచి మరో డేట్ లోకి షిఫ్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఇందుకు ఉన్న కారణాల్లో తెలంగాణాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రభావం కూడా ఒకటి. కాగా ఇపుడు మళ్ళీ ఎన్నికలు మూలాన కొన్ని సినిమాలు డేట్స్ మారుతాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి ఇది ఏపీలో అని తెలుస్తుంది. ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ లో అవుతాయి అని ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. దీనితో ఏప్రిల్ మొదటి వారం లోనే ఎన్నికలు ఉంటే అప్పుడు ఉన్న భారీ చిత్రం “దేవర” ఖచ్చితంగా పోస్టుపోన్ అవుతుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.
మరి ఒకవేళ ఈ డేట్ నుంచి కనుక ఎన్టీఆర్ తప్పుకుంటే ఈ డేట్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” తో వచ్చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ మేకర్స్ ఫ్యామిలీ స్టార్ కోసం మార్చ్ 22 కూడా లాక్ చేసుకున్నారని టాక్ ఉంది. మరి ఇది కూడా మిస్ అయ్యి ఎన్టీఆర్ సినిమా గనుక తప్పుకుంటే చిత్ర యూనిట్ ఆరోజు రావాలని చూస్తున్నారట.
మరి ఈ సినిమాల విషయంలో ఏమవుతుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అల్లు అరవింద్ బ్యానర్ నుంచి గీతా గోవిందం తర్వాత విజయ్ మరియు పరశురామ్ పెట్ల లు ఈ సినిమా చేస్తుండడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.