అలాంటి నిర్ణయం తీసుకోకు నాయనా అంటూ మహేశ్ ఫాన్స్ చేతులెత్తి మొక్కుతున్నారు..

Mahesh Babu

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తారు! ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను ప‌ట్టించుకోరు!! అంటూ పెద్ద బాంబ్ పేల్చారు పూరి జ‌గ‌న్నాథ్. ఈ విష‌యంపై మ‌హేష్ .. పూరి మ‌ధ్య వార్ గురించి తెలిసిందే. జ‌న‌గ‌న‌మ‌న స్క్రిప్టు ప‌ట్టుకుని మ‌హేష్ చుట్టూ తిరిగిన పూరీకి అత‌డి నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో పూరీ వ‌న్ ఫైన్ డే అత‌డిని తిట్టేస్తూ బ‌య‌ట‌ప‌డిపోయాడు. దానిపై ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

mahesh babu fans worried about mahesh decision
mahesh babu fans worried about mahesh decision

అదంతా పాత విష‌య‌మే అయినా.. పూరి జ‌గ‌న్నాథ్ ని మాత్ర‌మే కాదు స‌క్సెస్ లో ఉన్న సుకుమార్ ని కూడా మ‌హేష్ బాబు రిజెక్ట్ చేయ‌డం పెద్ద షాకిచ్చింది. ఈ రెండు ఇన్సిడెంట్స్ లో ప‌క్కా స్క్రిప్టు రెడీగా లేక‌పోతే మ‌హేష్ బాబు  ఏ డైరెక్ట‌ర్ కి అయినా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌ని అర్థ‌మైంది. భ‌ర‌త్ అనే నేను క్లీన్ హిట్. ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు క‌లెక్ష‌న్స్ బావున్నా.. స్క్రిప్టు లోపాలపై మ‌హేష్ గుర్రుమ‌న్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అన్న‌ట్టు త‌న‌కు బిగ్ ఫ్లాప్ నిచ్చిన మురుగ‌దాస్ స‌రైన స్క్రిప్టుతో వ‌చ్చి త‌న‌ని క‌లిస్తే మ‌హేష్ బాబు ఓకే చెబుతాడా? అంటే ఏమో చెప్ప‌లేం. ఎందుకంటే స్పైడ‌ర్ లాంటి భారీ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే చెత్త‌గా తెర‌కెక్కించిన మురుగ‌దాస్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఆ భ‌యంతోనే మురుగ‌దాస్ కి స్క్రిప్టు ప‌రంగా చాలా టెస్టులు ఎదుర‌వుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహాల్లేవ్.

అయితే పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవాలి! అన్న తీరుగా మురుగ‌దాస్ స్పైడ‌ర్ లోని మ‌హేష్ బాబు ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ అలానే ఉంచేయడంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంకా దానిని తొల‌గించ‌కుండా మ‌రో సూప‌ర్ హిట్ ఇచ్చే వ‌ర‌కూ నిదుర‌పోను! అంటూ మురుగ ప‌ట్టువీడ‌క చాలా కసిగానే ఉన్నాడు. అందుకే ఇప్పుడు అత‌డు మ‌హేష్ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నాడా? త్వ‌ర‌లోనే క‌ల‌వ‌బోతున్నాడా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ట్విట్ట‌ర్ వాల్ లో స్పైడ‌ర్ ఫోటో తీసేసే వ‌ర‌కూ మ‌హేష్ బాబు అభిమానుల‌కు నిదుర ప‌ట్టేట్టు లేదు.

అయితే త‌న‌కు అంత పెద్ద డిజాస్ట‌ర్ ని ఇచ్చిన మురుగ‌దాస్ ని మ‌హేష్ న‌మ్ముతాడా? అన్న‌దే ఇప్ప‌టికీ సస్పెన్స్. స్క్రిప్టు చెప్పి త‌న‌ని ఒప్పించ‌డం అంటే అంత ఆషామాషీ అయితే కాదు. అలాగ‌ని పూరి జ‌గ‌న్నాథ్.. సుకుమార్ .. మురుగ‌దాస్ వంటి వారికి డోర్స్ క్లోజ్ అయిపోయిన‌ట్టు కానేకాదు. మంచి స్క్రిప్టే అన్నిటికీ స‌మాధానం. మురుగ‌దాస్ ఇప్ప‌టికే బ‌న్నీని లైన్ లో పెట్టాడ‌న్న మ‌రో వార్తా వేడెక్కించింది కాబ‌ట్టి అదే స్క్రిప్టును అటూ ఇటూ తిప్పుతున్నాడా? అన్న‌ది కూడా తేలాల్సి ఉంటుంది.