ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న మహేష్ బాబు.. అభిమానులకు పూనకాలే!

బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ప్రస్తుతం ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని రేటింగ్స్ పెరగడం కోసం పలువురు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. అదే విధంగా నటి సమంత డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.

Mahesh Babu | Telugu Rajyamఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో మహేష్ అభిమానులు, తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఈ ఇద్దరి హీరోలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలియడంతో అభిమానులకు పండగ వాతావరణం అని చెప్పవచ్చు. అయితే ఈ త్వరలోనే ఎపిసోడ్ ప్రసారం కాబోతోందని వెల్లడించారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రచారం అయ్యే సమయంలో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయని ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయంలో ఇద్దరి ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయంటూ అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles