ఓటిటి : లేటెస్ట్ హిట్ “లవ్ టుడే” రిలీజ్ ఎప్పుడు, ఎందులో అంటే.!

కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ హిట్స్ అవుతాయో తెలిసిందే. మరి అలాంటి కొన్ని షాకింగ్ హిట్ చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన తమిళ సెన్సేషనల్ హిట్ చిత్రం “లవ్ టుడే”. యంగ్ హీరో హీరోయిన్ లు ప్రదీప్ రంగనాథన్ మరియు ఇవానా లు నటించిన ఈ చిత్రం తమిళ్ లో భారీ హిట్ కాగా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

అయితే ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుండగానే ఆల్రెడీ ఓటిటి లో రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది. అయితే మొదటగా ఈ చిత్రం తమిళ్ లో స్ట్రీమింగ్ కి నెట్ ఫ్లిక్స్ లో రాబోతుండగా నెక్స్ట్ ఈ చిత్రం తెలుగులో ఇదే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం తెలుగులో ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా టాక్. మరి దీనిపై నెట్ ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడుగా కూడా ప్రదీప్ నే వర్క్ చెయ్యగా తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు.