లేటెస్ట్ న్యూస్ : “బింబిసార” ఈవెంట్ లో షాకింగ్ ఘటన? ఎవరికి ఏమైంది?

తెలుగు సినిమా దగ్గర మళ్ళీ కాస్త బాక్సాఫిస్ వాతావరణ పరిస్థితులు కుదుట పడినట్టు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ విక్రాంత్ రోనా అలాగే రామారావు సినిమాల ఓపెనింగ్స్ తో కొత్త ఉత్సాహం మొదలు కాగా మరో భారీ సినిమాగా మంచి ఫలితాన్ని ఓపెనింగ్స్ ని అందుకునే చిత్రంగా నిలవొచ్చు అనే అంచనాలతో వస్తున్న చిత్రం “బింబిసార”.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ కాంబోలో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 40 కోట్లకి పైగానే బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే నిన్ననే ఈ సినిమాకి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చిత్ర బృందం హైదరాబాద్ లో చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు.

అయితే ఈ ఈవెంట్ అంతా సక్సెస్ ఫుల్ గానే అయ్యింది కానీ లేటెస్ట్ గా సినీ వర్గాల నుంచి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అక్కడ సడెన్ గా ఎవరికో ఏదో అయ్యిందని వారిని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారని వార్తలు బయటకి వచ్చాయి. అయితే ఇది వచ్చిన అభిమానుల్లో ఎవరికో అలా జరిగిందని తెలుస్తుంది. మరి ఎవరికి ఏమయ్యిందో అనే వివరాలు అయితే ఇంకా బయటకి రావాల్సి ఉంది.