‘పుష్ప’ కోసం జాన్వీ కపూర్‌ని ట్రై చేస్తున్నారటగానీ.!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాని రష్యాలో తాజాగా విడుదల చేస్తున్న దరిమిలా, అక్కడ ప్రమోషన్స్ చేసేందుకు ‘పుష్ప’ టీమ్ వెళుతోంది. రష్మిక మండన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జతగా నటించింది. ఇదిలా వుంటే, ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమయ్యిందంటున్నారు.. కానీ, ఆ వాతావరణమైతే కనిపించడంలేదు.

‘పుష్ప ది రైజ్’ సినిమాలో ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో సమంత చెలరేగిపోతే, ‘పుష్ప ది రూల్’ స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారన్నదానిపై బోల్డన్ని గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయ్.. వస్తున్నాయ్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘పుష్ప ది రూల్’ టీమ్, తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని స్పెషల్ సాంగ్ కోసం పంప్రదించినట్లు తెలుస్తోంది. జాన్వీ నుంచి ఏం ఆన్సర్ వచ్చింది.? అన్నదానిపై స్పష్టత లేదు. జాన్వీ ఒప్పుకోకపోయినా, ‘పుష్ప ది రూల్’ టీమ్ ముందు వేరే ఆప్షన్ వుందట. ఆ ఐటమ్ బాంబ్ కూడా వన్ ఆప్ దిమ మోస్ట్ పాపులర్ హీరోయిన్స్.. అని అంటున్నారు.