నయనతార ‘నో’ చెప్పింది మళ్ళీ.!

నయనతారతో తెలుగు సినిమా అంటే అంత ఈజీ కాదు.! ఆమెను ఒప్పించడం చాలా కష్టమైన పని. రెమ్యునరేషన్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తుంది. తెలుగులో సినిమాని పబ్లిసిటీ చేయడం కోసం అయితే అస్సలు రాదు.

ఎలాగోలా నయనతారతో ‘గాడ్ ఫాదర్’ సినిమాని చిరంజీవి చేశారు. అంతకు ముందు ‘సైరా నరసింహారెడ్డి’లో కూడా ఆమె నటించింది. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇలా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో నయనతార నటించింది.

ప్రభాస్, రవితేజ సరసన కూడా నటించింది నయనతార గతంలో. అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. తాజాగా ఓ సీనియర్ హీరో సినిమా కోసం నయనతారని సంప్రదిస్తే, ‘నో’ చెప్పేసిందట ఆమె.

చిత్రమేంటంటే, గతంలో కూడా ఆ హీరోతో సినిమాకి నయనతార ఒప్పుకోలేదట. ఎవరా హీరో.? ఏమా కథ.? రెమ్యునరేషన్ ఎంతైనా ఫర్లేదు, పబ్లిసిటీ కోసం రాకపోయినా ఫర్లేదు.. అని అన్నాగానీ, నయనతార ఎందుకు ‘నో’ చెప్పిందో ఏమో.! నయనతారతో అంతే.. అలాగే వుంటుంది.!