“RRR” పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు జ్ఞ్యానోదయం అయ్యిందా??

RRR

ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ మల్టీ స్టారర్ సినిమా టాక్ వస్తే డెఫినెట్ గా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మాసెస్ట్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా చేసిన బిగ్గెస్ట్ ఏక్షన్ ఎమోషనల్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR) కోసం కూడా చెప్పి తీరాలి.

 

అయితే ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అన్నపుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే టాక్ ఎంత పాజిటివ్ వాతావరణం ఉన్నా రాక తప్పదు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద రచ్చే అయ్యింది. థియేటర్స్ లో చూసాక రాజమౌళి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంతా ఇంతా కాదు.

 

ఎన్టీఆర్ కి రాజమౌళి వెన్ను పోటు పొడిచాడని రామ్ చరణ్ కి కావాలని హైలైట్ చేసి ఎన్టీఆర్ ని తగ్గించేసాడని ఇంకా దారుణంగానే తిట్టుకున్నారు. కానీ ఓటిటి లో రిలీజ్ అయ్యాక సీన్ అంతా రివర్స్ అయ్యింది. సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కన్నా హైలైట్ అయ్యాడని వారు చెప్తున్నా లేటెస్ట్ మాట.

 

అప్పుడు చూడని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూస్తూ రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్ హైలైట్ అయ్యే సీన్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణకు ఒక సీన్ కోసం చూస్తే రామరాజు ఎన్నో ఏళ్ళు నుంచి ప్రజల్లో చైతన్యం కోసం నిశ్శబ్ద యుద్ధం చేస్తాడు కానీ భీమ్ ఒక్క పాటతో దాన్ని సాధించాడని రామరాజు పాత్ర చెప్తుంది.

 

అంటే ఆ ఒక్క పాట ముందు రామరాజు ఇన్నాళ్లు చేసిన ఉద్యమం చిన్నబోయింది అని చెప్పాడు. ఇలాంటి సీన్ ని అప్పుడు గమనించలేదు కానీ ఇప్పుడు ఇవన్నీ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీనితో ఇప్పుడు వీరికి జ్ఞ్యానోదయం అయ్యినట్టు అనిపిస్తుంది అని చెప్పాలి.