పవన్ ని సీఎం గా చూస్తా..తన డైరెక్టర్ కీలక కామెంట్స్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని వారు ఉండరు. అలాగే పవన్ అయితే తెలుగు స్టేట్స్ లో హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఓ పవర్ ఫుల్ పెర్సనాలిటీ గా కూడా మారుతూ వస్తుండడంతో అంతా ఇపుడు తన చుట్టూ పరిస్థితి ఆసక్తిగా మారింది.

మరి పవన్ రాజకీయాల్లో ఏదో ఒకరోజు ఉన్నత స్థానానికి వెళ్తాడని తన అన్నయ్య చిరంజీవి పలు కీలక కామెంట్స్ చేయగా ఇప్పుడు చిరు తో పాటుగా పవన్ సీనియర్ దర్శకుడు ఎస్ జె సూర్య తాజాగా పలు కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. పవన్ తో తాను ఖుషి, కొమరం పులి చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.

మరి ఏ ప్రయాణంలో అయితే పవన్ ఎలాంటివాడో తెలుసుకున్నానని తెలుగు రాష్ట్రాల్లో పవన్ ప్యూర్ మనసు కోసం తెలియని వారు ఎవరూ ఉండరు. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అయ్యాడని నేను గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని గర్వంగా ఫీల్ అవుతానని ఏఎస్ జె సూర్య లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో పవన్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.