శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల

ప్రముఖ నటి శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల విూడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఏదైనా మొదలుపెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటని తెలిపారు. త్వరలో రాబిన్‌ హుడ్‌ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.

కాగా, తెలుగులో వరుస సీనిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టున్నారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించనున్నట్లు తెలుస్తున్నది. అది ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా టాక్‌. ఇందులో శ్రీలీలతోపాటు మృణాల్‌ ఠాకూర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. కామెడీ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీని దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. జూలై చివర్లో షూటింగ్‌ ప్రారంభమవుతున్నదని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.