ఆ ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందనుకున్నా.. నరేష్ కామెంట్స్ వైరల్!

అల్లరి నరేష్ ఒకానొక సమయంలో వరుస కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే క్రమక్రమంగా ఈయనకు అవకాశాలు తప్పకపోవడంతో పలువురు హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన మరోసారి హీరోగా అవకాశాలు అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే నవంబర్ 25వ తేదీ నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గత సినిమాల గురించి గుర్తు చేసుకున్నారు.సాధారణంగా ఒక సినిమా చేస్తున్నాము అంటే కథపై నమ్మకంతోనే సినిమా చేస్తాము. అయితే కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోగా మన అంచనాలని తారుమారవుతుంటాయి.ఈ క్రమంలోనే అల్లరి నరేష్ నటించిన నేను సినిమాపై ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నానని అయితే ఆ సినిమా మాత్రం తనకు చేదు ఫలితాన్ని అందించిందని తెలిపారు.

నేను సినిమా కథపై నమ్మకంతో ఈ సినిమాలో పని చేశాను. ఈ సినిమా ద్వారా తన జీవితమే మారిపోతుందని భావించాను.ఈ సినిమా మంచి ఫలితాలను ఇవ్వకపోయినా మంచి జ్ఞాపకాలను మిగిల్చిందని తెలిపారు.ఈ సినిమాలో నటించడం వల్లే తనకు గమ్యం, శంభో శివ శంభో, మహర్షి, నాంది వంటి సినిమాలలో అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా నరేష్ తన గత సినిమాల గురించి గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.