రాతపరీక్ష లేకుండా రైల్వేలో 1785 ఉద్యోగ ఖాళీల భర్తీ.. అత్యంత భారీ వేతనంతో?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ ఈస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ శిక్షణ కొరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

పదో తరగతి, ఐటీఐ మర్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 1785 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము 100 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉండనుందని సమాచారం అందుతోంది. డిసెంబర్ 27వ తేదీలోగా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.