Akkineni Family: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా అక్కినేని ఇంట జరుగుతున్న శుభకార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కినేని ఇంట్లో ఒక సదా ఒకవైపు అన్న నాగచైతన్య పెళ్లి ఏర్పాటు జరుగుతుండగా మరొకవైపు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా రెండు ఒకేసారి రావడంతో అభిమానులు మొదట ఆశ్చర్యానికి లోనయ్యారు. చైతన్య, శోభిత ధూళిపాళ ల వివాహం డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో బంధువులు,అతిథుల సమక్షంలో జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి వేడుకకు అతి ముఖ్యమైన 300 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్న సమయంలో అఖిల్ నిశ్చితార్థం జరిగిన గుడ్ న్యూస్ ని వెంటనే పంచుకున్నారు నాగ్. దీంతో అభిమానులు డబుల్ హ్యాపీ అయ్యారు. దీంతో అఖిల్ అలాగే నాగచైతన్య పెళ్లిళ్లు ఒకే వేదికపై ఒకేసారి జరగబోతున్నాయి అంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే రెండు వేడుకలు ఒకేసారి జరుగుతాయన్న ప్రచారాన్ని నాగ్ కొట్టిపారేశారు.
ముందు చైతు పెళ్లి అయ్యాక 2025 ప్రారంభంలో అఖిల్ ది జరిపించేలా ప్లాన్ చేస్తున్నారట. మాములుగా హిందూ సంప్రదాయాల్లో ఒకే రోజు అన్నదమ్ముల పెళ్లిళ్లు చేయడం అరుదు. మంచిది కాదని కూడా అంటారు. సినిమాల్లో చేసినట్టు చూపిస్తారు కానీ నిజ జీవితంలో తక్కువ. అందుకే చైతు, అఖిల్ వేడుకలు వేర్వేరుగా ఉండబోతున్నాయట. నెట్ ఫ్లిక్స్ చైతు పెళ్లి హక్కులను యాభై కోట్లకు తీసుకుందనే ప్రచారానికి చెక్ పెడుతూ అలాంటిదేమి లేదని అక్కినేని ఫ్యామిలీ నుంచి మొన్నే క్లారిటీ వచ్చేసింది.