Trisha: ఆ సినిమాను మధ్యలోనే వదిలేసి పోయాను.. త్రిష కామెంట్స్ వైరల్!

Trisha: హీరోయిన్ త్రిష గురించి మనందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం కన్నడ అనే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చేతినిండా బోలెడు సినిమాలు ఉన్నాయి. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ అంతే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.

ఇకపోతే త్రిష సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో హీరో అజిత్ కి జోడిగా నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న త్రిష తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. కెరీర్ తొలినాళ్లల్లో ఒక స్టార్ హీరో సినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తెలుగులో త్రిషకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది అంటే వర్షం అని చెప్పవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష టాప్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇది తనకు చాలా స్పెషల్స్ సినిమా అని చెప్పాలి. కాగా టీవి షోలో త్రిష మాట్లాడుతూ.. తన కెరీర్ లో అత్యంత ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా వర్షం. కెరీర్ ఆరంభంలో వర్షం సినిమా కోసం ఎంతో కష్టపడింది అని త్రిష తల్లి చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశారని, దీంతో జలుబు, జ్వరంతో త్రిష బాగా ఇబ్బంది పడిందని ఒక దశలో సినిమా వదిలేసి వెళ్లిపోవాలనుకుందని చెప్పుకొచ్చింది. అయితే చివరకు సినిమా ఫలితం చూశాక పడ్డ కష్టం అంతా మర్చిపోయిందని తెలిపింది. తన తల్లి చెప్పిన మాటలు వందశాతం నిజమని త్రిష తెలిపింది. ఈ సందర్బంగా త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ ఆమె ఆ సినిమా వద్దనుకొని వెళ్లిపోయి ఉంటే లైఫ్ లో చాలా కోల్పోయేది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే వర్షం సినిమా అటు హీరో ప్రభాస్ కు అలాగే త్రిషకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.