పిల్లల్లో చాలామంది టీని ఎంతో ఇష్టంగా తాగుతారనే సంగతి తెలిసిందే. అయితే పిల్లల ఆరోగ్యానికి టీ మంచిదేనా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీలో ఉండే కెఫిన్ పిల్లల శరీరానికి చెడు చేస్తుంది. పిల్లలు ఎక్కువ మొత్తంలో టీ తాగితే వాళ్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ కారణం వల్ల వాళ్లు ఎసిడిటీ సమస్యను సైతం ఎదుర్కొంటారని చెప్పవచ్చు.
కెఫిన్ ఎక్కువగా ఉన్న టీని తీసుకోవడం వల్ల పిల్లలు అధిక మూత్రవిసర్జన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టీ తాగడం వాళ్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. పిల్లల నిద్రపై టీ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా టీ ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.
చిన్న పిల్లలు టీ తాగడం వల్ల వారికి దంత సమస్యలు కచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. పిల్లలు టీ తాగితే నోటి దుర్వాసన సమస్య వేధించే ఛాన్స్ ఉంటుంది. టీ తాగడం వల్ల పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపించి రక్త హీనత పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్బాల్లో టీ పిల్లల్లో ఎముకలను బలహీనంగా మారుస్తుంది. టీ అలవాటు వల్ల పిల్లలకు భోజనం విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
పిల్లలు టీ కావాలని ఎంత మారం చేసినా వారికి టీ ఇవ్వడం చేయకూడదు. పాలు లేదా పండ్ల రసాలు తాగిస్తే వారు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. టీ ఎక్కువగా తాగే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది. మరీ ఎక్కువగా టీ తాగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు.