Actor Jayam Ravi: విడాకులకు వద్దంటూ మళ్ళీ కలవబోతున్న స్టార్ నటుడు.. ఎవరో తెలుసా?

Actor Jayam Ravi: కోలీవుడ్‌ నటుడు జయం రవి ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే. దాంతో ఆ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు.ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించాడు. అయితే, విడాకుల విషయంలో తన ప్రమేయం లేదని ఆర్తి తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. తన అనుమతి లేకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటి అంటూ జయం రవి నిర్ణయాన్ని తప్పుపట్టింది.

కానీ, లాయర్‌ ద్వారా ఆర్తికి విడాకుల నోటీసు పంపించానని జయం రవి చెప్పుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ తన భార్య ఆర్తితో కలిసి జీవించబోతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం గురించి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. కొన్నేళ్ల పాటు డేటింగ్ తర్వాత 2009లో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే దాదాపుగా 15 సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ జంట కొన్ని విభేదాలు రావడంతో విడాకుల నోటీస్ వరకు వీళ్ళ వ్యవహారం వెళ్లినట్లు వార్తలు వినిపించాయి.

జయం రవి, ఆర్తి విడాకుల కేసు చెన్నై మూడో కుటుంబ న్యాయ స్థానంలో జడ్జి తేన్‌మొళి విచారణ చేశారు. సయోధ్య కేంద్రంలో మధ్య వర్తిత్వానికి హాజరు కావాలని దంపతులను ఆదేశించారు. అయితే అక్కడ జయం రవి, ఆర్తి ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారట. మధ్యవర్తితో పాటు ఒక గంటకు పైగా సాగిన చర్చలో వారిద్దరూ కూడా సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం. స్లాగ్ ఎలాంటి ఆందోళన లేకుండా తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారట. పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని మధ్యవర్తి ఇచ్చిన కౌన్సిలింగ్‌ తో వారు కాస్త ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. దీంతో మళ్లీ వారిద్దరూ కలవబోతున్నారు అంటూ కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా అభిమానులకు శుభవార్త అని చెప్పాలి. ఈ విషయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.