Esha Rebba : జాక్ పాట్ కొట్టిన తెలుగమ్మాయి… మాస్ రాజా సినిమాలో కీలక పాత్ర…!

Esha Rebba : తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో రాణించడం ఈ మధ్య కాలంలో అరుదు. పర భాషా చిత్రాల్లో తెలుగమ్మాయిలకు ఆదరణ ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఆదరణ తక్కువనే చెప్పాలి. తెలుగమ్మాయి ఇషా రెబ్బ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. తెలుగులో ఒక మంచి బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఆ మధ్య ఆ సినిమా లో మంచి పాత్రతో మెరిసింది. ఆ తరువాత అరవింద సామెత సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించి ఇక కెరీర్ గాడిలో పడింది అనుకుంది.

కానీ ఇషా ఆశించిన ఫలితం రాలేదు. మంచి అవకాశాలను తెలుగులో అందుకోలేక పోతోంది. ఇక ఆహా ఒరిజినల్స్ లో త్రీ రోజస్ వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఆశించిన ఫలితం మాత్రం దొరకలేదు. ఈ అమ్మడు ఇపుడు మాత్రం రవి తేజ సినిమా లో ఛాన్స్ కొట్టి జాక్ పాట్ కొట్టిందని అంటున్నారు. ఈ సినిమా లో పాత్ర క్లిక్ అయితే మాత్రం ముద్దుగుమ్మ కెరీర్ దూసుకుపోతోంది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రకోసం ఇషా రెబ్బాను ఎంపిక చేశారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది . ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందట. ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం నుంచి టాక్ వినిపిస్తోంది. గతంలో నక్కిన తీసిన చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే రవితేజ సినిమా కూడా ఫుల్ కామెడీగా సాగుతుందట. పైగా రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్టు ఈ సినిమా ఉండనుంది. కాగా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్‌ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. కార్తీక్‌‌ ఘట్టమనేని సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమా అయిన ఇషా రెబ్బ ఫేట్ మారుస్తుందేమో చూడాలి.