రివ్యూ : బ్రహ్మాస్త్ర

 

రివ్యూ  : బ్రహ్మాస్త్ర –  

నటీనటులు: రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని, షారూఖ్ ఖాన్  తదితరులు.

దర్శకుడు: అయాన్ ముఖర్జీ

సంగీత దర్శకులు: సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్

 

 సినిమాటోగ్రఫీ: వి. మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, పాట్రిక్ డ్యూరక్స్

ఎడిటర్: ప్రకాష్ కురుప్

నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ,

షారుఖ్ ఖాన్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు,  రణబీర్ కపూర్ – ఆలియా భట్  హీరో హీరోయిన్లు.. ఇది చాలు ఈ సినిమా స్థాయి ఏమిటో చెప్పడానికి. మరి ఇలాంటి భారీ సినిమా  ‘బ్రహ్మాస్త్ర’  భారీ అంచనాల మధ్య  నేడు రిలీజ్ అయింది. కాగా ఈ  సినిమా ఎలా ఉంది ?, రివ్యూలోకి వెళ్లి  చూద్దాం.  

 

కథ : 

 

ఈ సృష్టిలో ఎన్నో  పురాతన శక్తులు ఉంటాయి. ఆ శక్తులను కాపాడేవారు ఉంటారు. అయితే, ఈ బ్రహ్మాస్త్ర కథలో  ఆ శక్తులు ప్లేస్ లో అస్త్రాలు పెట్టి కథ రాసుకున్నాడు అయాన్ ముఖర్జీ. ఇక సృష్టిలో మంచిని కోరుకునే వారు ఎలా అయితే ఉంటారో,  అలాగే చెడు కోరుకునే వారు కూడా  ఉంటారు, సో వాళ్ళను విలన్స్ గా పెట్టేసుకుని కథ అయిపోతుంది అనుకున్నాడు అయాన్ ముఖర్జీ. నిజంగా బ్రహ్మాస్త్ర కథ ఇలాగే సాగింది. ఎక్కడా కథలో డెప్త్ లేదు. 

ఇంతకీ కథని  క్లుప్తంగా చెప్పుకుంటే..  అస్త్రాలన్నిటికీ బ్రహ్మాస్త్ర అధిపతి గా ఉంటుంది. అయితే, ఈ బ్రహ్మాస్త్ర దుస్తుల చేతికి పోతే  మొత్తం సృష్టికే ప్రమాదం. అందుకే.. ఈ బ్రహ్మాస్త్రని మూడు భాగాలుగా చేసి  దుష్టుల చేతికి చిక్కకుండా  బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కి చెందిన బ్రహ్మాన్ష్‌ గ్రూప్ వారు కాపాడుతూ ఉంటారు. అయితే,  ఆ  బ్రహ్మాస్త్ర ని పొందాలని  మౌనీ రాయ్‌ అండ్‌ విలన్ గ్రూప్ అనేక ప్రయత్నాలు చేస్తూ.. బ్రహ్మాన్ష్‌ గ్రూప్ కు చెందిన  అనీష్(నాగార్జున) ను,  శాస్త్రవేత్త మోహన్ భార్గవ్‌(షారుఖ్ ఖాన్) ను చంపుతారు. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర ని కాపాడే బాధ్యత డీజే శివ(రణబీర్‌ కపూర్‌) పై పడుతుంది.   డీజే శివ కి  – బ్రహ్మాస్త్ర కి మధ్య ఒక సంబంధం ఉంటుంది ?, ఇంతకీ ఏమిటి ఆ సంబంధం ? ఈ మధ్యలో  శివ, ఇషా(అలియా భట్)తో  ఎలా  ప్రేమలో పడ్డాడు ?,  చివరకు తన ప్రేమ కోసం శివ ఏం చేశాడు ?, అలాగే  బ్రహ్మాస్త్ర ను కాపాడటానికి గురూజీ (అమితాబ్ బచ్చన్)తో కలిసి ఎలాంటి పోరాటం చేశాడు ? అనేది మిగిలిన కథ. 

 

విశ్లేషణ :  

 

బ్రహ్మాస్త్ర  గురించి సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో  విజువల్స్  బాగున్నా.. కంటెంట్ మిస్ అయ్యింది. రణబీర్ – అలియా పాత్రల మధ్య  కెమిస్ట్రీ ఉన్నా.. ఎమోషన్ అండ్ ప్యూర్ లవ్  మిస్ అయ్యింది. ఇటు అమితాబ్ – రణబీర్  మధ్య కాన్ ఫ్లిక్ట్  ఉన్నా..  ఫీల్ మిస్ అయ్యింది. ఇక షారుఖ్ ఖాన్, నాగార్జున తమ నటనతో మెప్పించినా.. వారి పాత్రల్లో సంఘర్షణ మిస్ అయ్యింది. మొత్తమ్మీద బ్రహ్మాస్త్ర లో కథాకథనాలు మిస్ అయ్యాయి.  దీనికితోడు  మా బ్రహ్మాస్త్ర  సినిమా అద్భుతంగా భారీ స్థాయిలో ఉంటుంది అంటూ ఈ సినిమా పై చిత్రబృందంతో పాటు రాజమౌళి కూడా డప్పు కొట్టాడు. 

 

దాంతో బ్రహ్మాస్త్ర పై  పెరిగిన  భారీ అంచనాలు కూడా,   ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ అయ్యాయి.  అసలు రాజమౌళి  బ్రహ్మాస్త్ర  గురించి చెప్పిన మాటలకు, సినిమాలోని, సాంకేతిక వర్గం పనితనానికి ఎక్కడా పొంతన లేదు.  భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో కనీస స్థాయి కథ కూడా లేదు. కాకపోతే, భారీ తారాగణం,  భారీతనం మాత్రం ఉంది. 

 

ఉపయోగం ఏముంది ?,  కథ లేని విజువల్ ఎప్పటికీ ఎవ్వరికీ కనెక్ట్ కాదు. సినిమాని అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో  తీయాలనే తాపత్రయంలో గ్రాండ్ విజువల్స్ ను పెట్టారు గాని,  గొప్పగా ప్లే ను మాత్రం రాసుకోలేదు. దీని తోడు కథను కూడా రొటీన్ చేసి పారేశారు. బ్రహ్మాస్త్ర  మొదలైన మొదటి నిమిషం నుంచి  అభిమానులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. వారికి దర్శకుడు అయాన్ ముఖర్జీ  ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ప్రతి పది సీన్స్ కి  ఒక భారీ ఎలివేషన్ సీన్ ఉంటుంది.  కానీ, ఫ్యాన్స్ లో ఉత్సాహం లేదు. కారణం.. కథలో కథనంలో కంటెంట్ లేకపోవడమే.

Brahmastra Telugu Movie Review
Brahmastra Telugu Movie Review


ప్లస్ పాయింట్స్ :

రణబీర్, అమితాబ్, షారుఖ్, నాగార్జున  స్క్రీన్ ప్రెజెన్సీ,

అలియా  గ్లామర్.

భారీ యాక్షన్ విజువల్స్,

మైనస్ పాయింట్స్ :

 


సిల్లీ కథాకథనాలు, 


రొటీన్ సీన్స్ తో సాగే  స్లో నేరేషన్,

స్లోగా సాగే బోరింగ్ స్క్రీన్ ప్లే,

 

సినిమాటిక్ టోన్ మరీ  ఎక్కువ అవ్వడం,

 

స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.

అన్నిటికీ మించి ఇంట్రెస్టింగ్  కంటెంట్  పుష్కలంగా మిస్ అవ్వడం.

తీర్పు : 

బ్రహ్మాస్త్ర   అంటూ  ప్యూర్ విజువల్ వండర్ వ్యవహారాలతో వచ్చిన  ఈ సినిమాలో రణబీర్ – అమితాబ్ – షారుఖ్ – నాగార్జున ల కాంబినేషన్, కొన్ని  ఎమోషన్స్ అండ్ విజువల్స్  బాగున్నాయి. కానీ, సినిమాలో కంటెంట్ లేదు. దీనికితోడు నీరసంగా సాగే  కథతో పాటు  మిగిలిన బాగోతం అంతా  రొట్ట కొట్టుడు మేకింగ్ స్టైల్ తో   రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతో సాగింది.  ఈ చిత్రం బాగా  నిరుత్సాహ పరిచింది.

 
 
రేటింగ్ : 2.25 / 5