‘బ్రహ్మాస్త్ర ‘ సినిమా ప్రమోషన్స్ లో జక్కన్న ఇంత కష్టపడటానికి గల కారణం అదే..?

బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న బిగ్గెస్ట్ విజువల్ వండర్ సినిమా బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన సినిమా సెప్టెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ అమితాబచ్చన్ ,మౌని రాయ్ వంటి ప్రముఖులు కూడా నటించారు. ఇక ఈ సినిమాకి సౌత్ ఇండస్ట్రీలో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సినిమా విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సెప్టెంబర్ రెండవ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి అధ్యక్షతన నిర్వహించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలవల్ల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. దీంతో వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. సాధారణంగా రాజమౌళి తాను దర్శకత్వం వహించిన సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా కష్టపడుతూ ఉంటాడు. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుండి సినిమా రిలీజ్ అయ్యే వరకు వివిధ రకాలుగా సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ విషయంలో జక్కన్న తర్వాతే ఎవరైనా అని కూడా చెప్పవచ్చు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి చాలా కష్టపడుతున్నాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. బ్రహ్మాస్త్ర సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమా బిజినెస్ లో కూడా రాజమౌళి భాగం ఆయినట్లు తెలుస్తోంది. ఆంద్రప్రదేశ్ లో బ్రహ్మాస్త్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను రాజమౌళి తన మిత్రుడు బళ్లారి సాయితో కలిసి తీసుకున్నట్లు సమాచారం. అందువల్ల రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే అంతే కాకుండా ఈ సినిమా కంటెంట్ మీద కూడా రాజమౌళికి చాలా నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ విధంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.