బ్రహ్మాస్త్ర సినిమాని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

రణబీర్ కపూర్, అలియా భట్ లీడ్ రోల్ లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ లు ముఖ్య పాత్రల్లో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మొదటి భాగం ఇటీవలే విడుదలయ్యి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదట్లో ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కానీ మెల్లగా కలెక్షన్స్ అందుకున్నాయి.

అయితే ఈ సినిమా లో నాగార్జున రోల్ మన టాలీవుడ్  హీరో కి వచ్చిందంట. అతను సుధీర్ బాబు, అప్పటికే బాలీవుడ్ లో ‘భాగీ’ సినిమాలో నటించిన సుధీర్ బాబు కి ‘బ్రహ్మాస్త్ర’ లో నటించే అవకాశం వచ్చిందంట కానీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు.

‘బ్ర‌హ్మాస్త్ర’ లో న‌టించే అవ‌కాశం మొద‌ట త‌న‌కే వ‌చ్చింద‌ని చెప్పాడు. అయితే అప్పుడు తాను స‌మ్మోహ‌నం సినిమా షూటింగ్ తో పాటూ పుల్లెల గోపిచంద్ సినిమాలో నటిస్తున్నాడు వల్ల ఆ సినిమాను రిజెక్ట్ చెయ్యవలసి వచ్చిందని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ప్ర‌స్తుతం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో న‌టించాడు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.