World Wide First Day Collections : RRR : వరల్డ్ వైడ్ ఫస్ట్ డే వసూళ్ల ప్రకంపనలు..వివరాలు ఎలా ఉన్నాయంటే.!

World Wide First Day Collections : ఇప్పుడు మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర ఒక సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. గత ఐదేళ్ల కితం వచ్చిన “బాహుబలి పార్ట్ 2” ఎలా అయితే ప్రకంపనలు సృష్టించి సరికొత్త బాక్సాఫీస్ రికార్డులకు మార్గం సెట్ చేసిందో.. ఇప్పుడు అలాంటి బిగ్గెస్ట్ ఇండియాస్ బ్లాక్ బస్టర్ ని పక్కకి నెట్టి నెవర్ బిఫోర్ ఇండియాస్ బ్లాక్ బస్టర్ గా ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం కళ్ళు చెదిరే వసూళ్ళని అందుకుంది.
ఆల్రెడీ అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో రికార్డు బ్రేకింగ్ వసూళ్ళని అందుకున్న ఈ చిత్రం అసలు ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ఎంత కలెక్ట్ చేసింది అనే మాట పెద్ద ఎత్తున సెన్సేషన్ ని రేపుతూ వైరల్ అవుతుంది. అయితే చాలా మంది సినీ ట్రాకర్స్ ఈ సినిమా వసూళ్లపై అనేక లెక్కలు చెబుతున్నారు.
వాటిలో అయితే హైయెస్ట్ గా ఈ భారీ సినిమా ఏకంగా 250 కోట్లు వసూలు చేసి ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని వసూళ్ళని కొల్లగొట్టినట్టు చెబుతున్నారు. అలాగే మరోపక్క సినీ వర్గాల నుంచి మాత్రం ఈ సినిమా బాహుబలి 2 ని బ్రేక్ చేసి 223 కోట్లు వాసులు చేసినట్టు చెబుతున్నారు.
అయితే ప్రాంతాల వారీగా ఒకసారి ఈ సినిమా వసూళ్లు చూసినట్టు అయితే వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ కి 120 కోట్లు ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 100 కోట్లు గ్రాస్ అలాగే హిందీలో దాదాపు 20 కోట్లు నెట్ వసూళ్లు ఇంకా తమిళనాట 9.2 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లు అలాగే మలయాళ ఇండస్ట్రీలో 4 కోట్లు అలాగే ఓవర్సీస్ లో దాదాపు ఎన్ని దేశాల్లో రిలీజ్ అయ్యిందో అన్ని దేశాల్లో కలిపి 70 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందట.
అంటే మొత్తం కలిపి 239 కోట్లు గ్రాస్ ని ఈ చిత్రం వసూలు చేసిందట. ఇది బిగ్గెస్ట్ ఇప్పుడు నుంచి బిగ్గెస్ట్ రికార్డు గా పరిగణించబడుతుంది అని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో హైర్స్ తో కలిపి అయితే 250 కోట్లు టచ్ అయ్యిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఫైనల్ గా రామ్ చరణ్ – రామారావు – రాజమౌళి ల RRR బాక్సాఫీస్ తుప్పు వదలగొడుతుంది అని చెప్పలి.