“సలార్” పై సంచలన వ్యాఖ్యలు..క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ దర్శకుడు 

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న బిగ్గెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా “సలార్” అనే చెప్పాలి.

కాగా ఈ చిత్రం ఈ సెప్టెంబర్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాకి అయితే ఆల్ మోస్ట్ ఏ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ సినిమాలు కానీ పోటీ కానీ లేదు. అయితే బాలీవుడ్ సినిమా నుంచి మాత్రం ఓ చిత్రం సేమ్ డే కి రిలీజ్ గా ఉంది. అయితే అది చిన్న సినిమానే కావచ్చు కానీ కంటెంట్ పరంగా ఈ చిత్రం సలార్ కి గట్టి పోటీ ఇచ్చేది అని చెప్పాలి.

అయితే ఈ చిత్రం “వాక్సిన్ వార్” కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సంచలన చిత్రం “కాశ్మీర్ ఫైల్స్” దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అయితే తెరకెక్కించాడు. దీనితో ఈ సినిమా హిట్ అయితే మాత్రం సలార్ కి బాక్సిఫిస్ దగ్గర చాలా ప్రమాదమే అని చెప్పాలి. అయితే లాస్ట్ టైం కాశ్మిర్ ఫైల్స్, ప్రభాస్ రాధే శ్యామ్ ఒకేసారి రిలీజ్ కాగా హిందీ మార్కెట్ లో కాశ్మీర్ ఫైల్స్ రాధే శ్యామ్ ని క్రష్ చేసేసింది.

దీనితో మళ్ళీ ఇదే ప్రభాస్ సినిమాకి రిపీట్ అవుతుంది అని వివేక్ చెప్పినట్టుగా పలు కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో సెన్సేషన్ గా మారాయి. దీనితో ఈ సంచలన కామెంట్ నిజంగానే తాను చేశాడా అనే ఓ నెగిటివ్ స్ప్రెడ్ కాగా దీనిపై దర్శకుడు అయితే స్పందించారు.

అసలు తాను ఇలాంటి కామెంట్స్ చేయనే లేదు అని కావాలని ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రభాస్ ఇప్పుడు ఇండియా లో బిగ్ బిగ్ స్టార్ తాను మెగా బడ్జెట్ సినిమాలు చేస్తాడు మేము చిన్న సినిమాలు చేసుకుంటాం అని ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అయితే తాను కన్ఫర్మ్ చేశారు.