అండగా ఉన్నందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు: SKN

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, క‌మ‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి గ‌ల నిర్మాత‌గా గుర్తింపు పొందిన నిర్మాత ఎస్‌కెఎన్‌. ఇటీవల ఆయ‌న త‌న తండ్రిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా SKN మరియు అతని కుటుంబం అంతా తన తండ్రి గారి మరణంతో బాధలోనే ఉన్నారు.

కాగా ఈరోజు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌ కె ఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్పునిచ్చాడు. ఎస్‌కెఎన్ తండ్రి గారి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. మొద‌ట్నుంచి అల్లు అర్జున్ యొక్క ప్రతిభ మరియు అంకితభావానికి అమితమైన ఆరాధకుడు అయిన ఎస్‌ కె ఎన్‌, ఆయన్ని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఈరోజు బన్నీ తన ఇంటికి రావడం ఎస్‌ కె ఎన్‌ కి చాలా ఓదార్పునిచ్చింది.

ఇలాంటి క‌ష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సానుభూతి మరియు సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు. ‘బేబీ’, ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఎస్‌ కె ఎన్ అంద‌రికి సుప‌రిచితుడే.