బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌ను చూస్తున్న ఎవరికైనా నిన్నటి ఎపిసోడ్, ఎలిమినేషన్ విషయంలో షాక్ తగిలే ఉంటుంది. దేవీ నాగవల్లి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడమేంటని ఆశ్చర్యం కలగకపోదు. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్టు.. దేవీ ఎలిమినేషన్‌కు సవాలక్ష కారణాలున్నాయి. అందులో కొన్నింటి గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
దేవీ నాగవల్లి లాంటి కంటెస్టెంట్ నాల్గో సీజన్‌లో ఎవ్వరూ లేదు. ఆమెతో సరితూగే వారు కూడా ఎవ్వరూ లేరని అంటున్నారు. ఆలోచనా విధానంలో గానీ, అంచనా వేయడంలోగానీ, నడవడిక, నిజాయితీ, నిక్కచ్చిగా ఉండటం ఇలా ఏ విషయం తీసుకున్నా దేవీ నాగవల్లి టాప్ ప్లేస్‌లోనే ఉంటుంది. ఈ మూడు వారాల్లో దేవీ ఆటను, ఆమెను చూసిన ఎవ్వరైనా సరే ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించరు.
అయితే ఆమె ఎలిమినేట్ కావడంతో స్వయంకృతాపరాధం కూడా ఉంది. ఆమెను ఎవ్వరూ టార్గెట్ చేయకపోయినా.. చేశారని భ్రమించడం, సింపతీ కొట్టేయాలని ట్రై చేయడం, అమ్మ రాజశేఖర్‌తో ప్రవర్తించిన తీరు ఇలా బోలెడన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేవీ నాగవల్లిపై గతంలో ఉన్న నెగెటివిటి ఇంకా కొనసాగుతూనే ఉండటం. సోషల్ మీడియాలో ఓ వర్గం మాత్రం దేవీ ఎప్పుడెప్పుడు నామినేషన్‌లోకి వస్తుందా అని ఎదురుచూశారు. దేవీ నాగవల్లికి సపరేట్ ఫ్యాన్ బేస్ లేకపోవడం, పైగా ద్వేషించే వారే ఉండటంతో ఓట్లతో వెనకబడి ఉంటారని రకరకాలుగా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఓ మంచి కంటెస్టెంట్ అయితే వెళ్లిపోయింది.