ఇండస్ట్రీలో కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అది హీరోలైనా, హీరోయిన్స్ అయినా..మరెవరైనా. మంచి సినిమాలు .. స్టార్ హీరోల తో అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది హీరోయిన్స్ కెరీర్ ఎందుకు సజావుగా సాగదో అర్థం కాదు. అలాంటి వాళ్ళ లిస్ట్ లో గ్లామర్ అండ్ యంగ్ బ్యూటీ ప్రణీత సుభాస్ కూడా ఉంది. అందం, అభినయం ఉన్నా కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేక ఉసూరుమంటోంది.
పోకూరి బాబూరావు నిర్మాతగా ఈతరం ఫిలింస్ పతాకంపై ఎ.ఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ప్రణీత. ఆ తర్వాత సిద్దార్థ్ సరసన బావ అన్న సినిమా చేసింది. అయితే కెరీర్ ప్రారంభంలోనే సక్సస్ అందుకోలేకపోవడం ప్రణీత కి కాస్త మైనస్ అయింది. అయినా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్.టి.ఆర్ రభస, మంచు ఫ్యామిలీతో పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్ లాంటి సినిమాలు చేసింది. వీటిలో ఒక్క పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తప్ప మిగతావన్ని చెప్పుకునేంత హిట్ సినిమాలుగా నిలవలేదు. ఇక బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు లో చిన్న పాత్ర చేసినా అది ఎవరికీ గుర్తు లేదు.
ఇలా కెరీర్ లో స్టార్స్ తో నటించినా కూడా ప్రణీత కి లక్ అసలు కలిసి రాలేదు. యాక్టింగ్ పరంగా మంచి పేరుంది. గ్లామర్ రోల్స్ చేయగలుగుతుంది. కాని బ్యాడ్ లక్ తను నటించిన సినిమాలన్ని అనూహ్యంగా సక్సస్ సాధించకపోవడమే ప్రణీత కి పెద్ద మైనస్ అయింది. ప్రస్తుతం ఒక కన్నడ సినిమా.. రెండు హిందీ సినిమాలలో నటిస్తున్నట్టు సమాచారం. తెలుగులో మాత్రం దాదాపు ఫేడౌట్ అయినట్టే అంటున్నారు.