ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం అనేది ఉద్యోగాల్లోనూ, విద్యా రంగాల్లోనూ కీలక అర్హతగా మారుతోంది. ఏఐపై ఉన్న డిమాండ్‌ను గుర్తించిన విద్యా సంస్థలు ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక కోర్సులు, మాడ్యూల్స్‌ను తమ సిలబస్‌లో అనుసంధానిస్తున్నాయి. ముఖ్యంగా, చండీగఢ్ యూనివర్శిటీ లక్నో లాంటి విశ్వవిద్యాలయాలు తమ మొత్తం విద్యా కార్యక్రమాల్లో ఏఐను తప్పనిసరిగా తీసుకొస్తుండటం గమనార్హం. ఏకంగా 50 కోర్సులు కలపడం విశేషం.
ఇలాంటి చర్యలతో విద్యార్థులు మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా టెక్నికల్ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంతోపాటు ఆరోగ్య, ఫైనాన్స్, మెడికల్, ఎడ్యుకేషన్ వంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలు వేగంగా ప్రవేశిస్తున్నాయి. ఈ పరిణామం భవిష్యత్ ఉద్యోగాలన్నీ ఏఐ పరిజ్ఞానం కలిగినవారికే ప్రాధాన్యం కల్పించనున్నాయన్న సంకేతాలు ఇస్తోంది.
ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, నాసా వంటి గ్లోబల్ సంస్థలు భారత్‌లో విద్యాసంస్థలతో కలసి ఏఐ కోర్సులపై ఒప్పందాలు చేసుకుంటుండటం, విద్యావ్యవస్థలో టెక్నాలజీ ప్రాముఖ్యత ఎంత పెరిగిందో చెప్పకనే చెబుతుంది. ఎంఎల్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎన్ఎల్‌పీ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యార్థులు గ్లోబల్ మార్కెట్‌కి రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో చూస్తే, ఏఐ ఆధారిత విద్యా విధానం భవిష్యత్తులో ప్రధాన ధోరణిగా మారనుంది. ఉద్యోగాల్లో నిలదొక్కుకోవాలంటే ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి అయ్యే పరిస్థితి రూపుదిద్దుకుంటోంది. అంటే, రాబోయే కాలంలో విద్యార్థులు సాంకేతికంగా నవీకరించుకోకపోతే, మున్ముందు అవకాశాలన్నీ అటు పోయే అవకాశాలున్నాయి.