నాక్కూడా అవార్డు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.. తమన్నా కామెంట్స్ వైరల్!

మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూ ఒకానొక సమయంలో అగ్రతారక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఈమె ఇప్పటికీ పలు సినిమా అవకాశాలను అందుకొని బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.తాజాగా ఈమె లేడీ బౌన్సర్ గా నటించిన బబ్లీ బౌన్సర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జాతీయ అవార్డు విజేత మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తమన్నా పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తనకు తెలుగు సినిమాలంటే ఎంతో గర్వంగా ఉంటుందని తన కెరియర్ అక్కడి నుంచే ప్రారంభమైందని తెలుగు సినిమాల గురించి ప్రశంసల కురిపించారు.

ఇక బబ్లీ బౌన్సర్ సినిమా గురించి మాట్లాడుతూ తాను మొదటిసారిగా లేడీ బౌన్సర్ గా నటించాను. ఎంతో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన మధుర్ భండార్కర్ గురించి మాట్లాడుతూ ఆయన హీరోయిన్స్ అందరికీ అవార్డులు వస్తుంటాయి నాకు కూడా అవార్డు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.