Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.
ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇలా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీకి చిరంజీవి అందించిన సేవలకు గాను ఇప్పటికే ఈయనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో గొప్ప పురస్కారాలను అందజేశారు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా చిరంజీవి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక అయ్యారు. యూకే ప్రభుత్వం ఈయనని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు అదేవిధంగా మార్చ్ 19వ తేదీ యూకే పార్లమెంటులో చిరంజీవికి ఈ అవార్డును అందజేయబోతున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడంతో చిరు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా చిరంజీవి కావటం విశేషం. ఈ క్రమంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులలో చిరు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.