Tamannaah: ఎంత పెద్ద హీరో అయినా నటించను.. షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా?

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో దూసుకుపోతోంది తమన్నా. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు,హిందీ, మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమాలను తగ్గించేసిన తమన్నా ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగానే ఇటీవల హిందీలో రీసెంట్ గా వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది తమన్నా. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కనిపించి ప్రేక్షకులను కవ్వించింది. నిజానికి 2005 లో విడుదలైన హిందీ చిత్రం చంత్సా రోషన్ షెహ్రాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె క తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమానులను కూడా సంపాదించుకుంది. తెలుగులో దాదాపుగా అందరూ హీరోలతో సినిమాలు చేసింది. సినిమాలలో ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది.

బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలతో భారీగా క్రేజ్ తెచ్చుకుంది. నటి తమన్నా భాటియా ప్రస్తుతం తమిళం, తెలుగు అలాగే హిందీల్లో పాన్-ఇండియన్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో చివరిగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తమిళంలో ఇటీవల విడుదలైన బాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నాతో పాటు రాశి ఖన్నా, కోవై సరళ, యోగి బాబు, సంతోష్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. నేడు తమన్నా పుట్టిన రోజు ఈ సందర్భంగా తమన్నా గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పెద్ద హీరోల సినిమాల్లో పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా నటిస్తారా? అన్న ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ.. కథ సరిగా లేకపోతే ఎంత పెద్ద నటుడి సినిమా అయినా నటించను అని స్పష్టంగా తెలిపింది. కొన్ని సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోయినా నటించాను. కానీ తర్వాత ఆ సినిమా విజయం తన నిర్ణయం గురించి ఆలోచించేలా చేసింది అని చెప్పుకొచ్చింది తమన్నా.