‎Tamannaah: ఒకసారి కనిపిస్తే వారితో పెళ్లి చేసేస్తారా? క్రికెటర్ తో పెళ్లిపై తమన్నా సీరియస్!

Tamannaah: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఒకవైపు సినిమాలో మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది తమన్నా. ఇకపోతే ఇటీవల కాలంలో తమన్నా ఎక్కువగా ప్రేమ, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తోంది. మొన్నటి వరకు బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకు తిరిగి ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

‎కానీ అందరికి షాకిస్తూ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఎవరైనా పెళ్లి గురించి ప్రశ్నించినా కస్సుబుస్సు లాడుతోంది మిల్కి బ్యూటీ. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఒక రేంజ్ లో మండిపడింది ఈ ముద్దుగుమ్మ. అసలేం జరిగిందంటే.. తాజాగా పాక్‌ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌, తమన్నా త్వరలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ గతకొన్ని రోజులుగా నెట్టింట వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

‎దీనిపై తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ రూమర్స్‌ ను ఖండించింది. ఒకసారి కలిసి కనిపిస్తే పెళ్లి చేసేస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా తమన్నా చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తమన్నా చివరగా ఓదెల 2 తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. తెలుగుతోపాటు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తోంది.