హీరోలను ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారు.. మా అంటే ఆ హీరో సినిమాను ఫస్ట్ డే రోజు చూస్తారు. ఆ హీరోను ఫాలో అవుతుంటారు. ఆ హీరో సినిమాలను అస్సలు మిస్సవరు. ఇంకా ఆ హీరో ఏం చేసినా అందరికీ చెప్పుకుంటారు. అంతే కదా. అంతకు మించి ఫ్యాన్ అంటే ఇంకేం చేస్తాడు చెప్పండి అంటారా?
చేస్తాడు.. అంతకంటే ఎక్కువే చేస్తాడు ఫ్యాన్ అంటే. అల్లు అర్జున్ ఫ్యాన్ చూడండి.. తన అభిమాన హీరో అల్లు అర్జున్ ను చూడటం కోసం ఏకంగా 200 కిమీలు నడుచుకుంటూ వచ్చాడు. అది అభిమానం అంటే.
మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు అల్లు అర్జున్ కు పెద్ద వీరాభిమాని. ఎలాగైనా అల్లు అర్జున్ ను కలవాలనుకున్నాడు. అంతే.. వెంటనే గుంటూరు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన వచ్చాడు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఇంటి అడ్రస్ కనుక్కొని మరీ.. ఆయన ఇంటికి వెళ్లాడు. చివరకు తన అభిమాన హీరోను కలిశాడు.
ఆ యువకుడు.. 200 కిలోమీటర్ల దూరం నుంచి తనను కలవడానికి నడుచుకుంటూ వచ్చాడని తెలిసి అల్లు అర్జున్ వెంటనే తన అభిమానిని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. చాలాసేపు అతడితో ముచ్చటించాడు. తర్వాత అతడితో ఫోటోలు దిగి పంపించాడు బన్నీ.
ఆ యువకుడు.. సెప్టెంబర్ 17న మాచర్ల నుంచి కాలినడకన బయలుదేరి.. సెప్టెంబర్ 22న హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ ను కలవడం కోసం ప్రయత్నిస్తూ చివరకు సక్సెస్ అయ్యాడు.