ఇంస్టాగ్రామ్ లో దూకుడు ప్రదర్శిస్తున్న రౌడీ హీరో… ఏకంగా 17 మిలియన్ ఫాలోవర్స్?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. చిత్ర బృందం సైతం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇలా విజయ్ దేవరకొండ కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 17 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంస్టాగ్రామ్ లో 18 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉండగా అల్లు అర్జున్ వెనకే విజయ్ దేవరకొండ ఏకంగా 17 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇక ట్విటర్లో అల్లు అర్జున్ ఏకంగా 7మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకోగా ఈయన మాత్రం ట్విట్టర్లో కాస్త వేనకున్నట్టే తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు ట్విట్టర్ లో 3.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. లైగర్ సినిమా ద్వారా ఈయనకు భారీగా అభిమానులు పెరిగారు. ఈ సినిమా విడుదల అనంతరం ఈయన కుమారి ఇంతమంది ఫాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.