‘పుష్ప-2’ మ్యూజిక్‌లో 90 శాతం క్రెడిట్‌ నాదే : మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్‌

‘పుష్ప -2 ది రూల్‌’ కంపోజిషన్‌ వచ్చేసరికి మేకర్స్‌కు, డీఎస్పీకి మనస్పర్థలు వచ్చాయని ఇప్పటికే నెట్టింట వార్తలు కూడా రౌండప్‌ చేస్తున్నాయి. ఎవరూ క్రెడిట్‌ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్‌ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్‌ అయినా తప్పదని పుష్ప 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కామెంట్స్‌ కూడా చేశాడు దేవీ శ్రీ ప్రసాద్‌.

తాజాగా పుష్ప 2కు పనిచేసిన మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్‌ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. పనిని మొదలుపెట్టేముందు నేను స్క్రిప్ట్‌ను చదవలేదు. ఎందుకంటే ఎడిటింగ్‌ అయిన తర్వాత టీంలో జాయిన్‌ అయ్యా. అయితే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించా. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతంలో మేకర్స్‌ కొంత భాగాన్ని ఉంచినప్పటికీ.. క్లైమాక్స్‌ ఫైట్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్‌ నాదే. పుష్ప 2 భారీ ప్రాజెక్ట్‌. ప్రేక్షకుల దృష్టికోణంలోనే సినిమాను తెరకెక్కించా.

నేను పుష్ప 2 కోసం పైపు పరికరాలను ఉపయోగించాను. ఏఐని ఉపయోగించి వాయిస్‌ని సృష్టించి.. దాని ఇన్‌స్ట్రుమెంటల్‌గా మార్చాను. ఇది ఫ్రెష్‌ సౌండ్‌ ఫీల్‌ ఇస్తుంది. ప్రజలు ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు శామ్‌ సీఎస్‌. అయితే ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌దేనని చెప్పిన శ్యామ్‌.. నిర్మాణ పనులు త్వరగా ముగించాల్సి రావడంతో మేకర్స్‌ తనను టీంలోకి తీసుకొచ్చారని చెప్పాడు. పాటలు లేటని, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేటని తనను అంటూనే ఉంటారని,. ఇప్పుడు కూడా ఫంక్షన్‌కు ఆలస్యంగా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని తనదైన స్టైల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చురకలంటించాడు డీఎస్పీ.

ఎవరూ క్రెడిట్‌ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్‌ అయినా, స్క్రీన్‌పై క్రెడిట్‌ అయినా తప్పదన్నాడు దేవీ శ్రీ ప్రసాద్‌. టైంకు పాట ఇవ్వలేదు.. టైంకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వలేదు. టైంకు ప్రోగ్రామ్‌ రాలేదని ఎక్కువ కంప్లైట్స్‌ చేస్తూ ఉన్నాయి. మీకు నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్‌ కూడా ఉంటాయన్నాడు డీఎస్పీ.