సామాన్యులకు కేంద్రం శుభవార్త.. ఉపాధి హామీ పథకం డబ్బులు భారీగా పెంపు?

ఈ మధ్య కాలంలో మోదీ సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉందనే సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారు. మహత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ డబ్బులను పెంచుతున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటన చేయడం గమనార్హం.

ఈ పెంపు వల్ల ఉపాధి హామీ పథకానికి వెళ్లే వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంటుంది. హరియాణాలో ఉపాధి హామీ పథకానికి వెళ్లే వాళ్లకు రోజుకు 357 రూపాయలు లభించనున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఈ మొత్తం 220 రూపాయలకు అటూఇటుగా ఉంది. ఈ ఏడాది మార్చి నెల 24 వ తేదీ నుంచి పెరిగిన వేతనాలు అందుబాటులోకి వచ్చాయి.

సెక్షన్ 6 (1) ప్రకారం ఉపాధి హామీ పథకానికి వేతనం పెరిగిందని సమాచారం అందుతోంది. ఇస్తున్న వేతనాలతో పోల్చి చూస్తే రాష్ట్రాన్ని బట్టి 7 నుంచి 26 రూపాయలు వేతనం పెరిగిందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు చేసిన పనికి సంబంధించిన జీతం బ్యాంక్ ఖాతాలలో జమ కావడం జరుగుతుంది. ఆధార్ పేమెంట్ ఆప్షన్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి తక్కువ వేతనంతో పనులు మొదలు కాగా ఏడాదికి కనీసం 100 రోజుల పాటు పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం మాత్రం కేంద్రం అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్స్ లో ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.