సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం నిత్యం మన ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే చాలామంది ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు అయితే వీలు కాని వారు ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారి మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా దీపారాధన చేస్తూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే దీపారాధన చేసే సమయంలో మనం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా సరైన నియమాలను పాటిస్తూ దీపారాధన చేసినప్పుడే ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఉంటుంది.దీపారాధన చేసే సమయంలో చాలామంది స్టీల్ దీపపు ప్రమిదలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే ఇలా వెలిగించడం పూర్తిగా తప్పు అని పండితులు తెలియజేస్తున్నారు. దీపాలను ఎల్లప్పుడూ మట్టి లేదా రాగి ఇత్తడి ప్రమిదలలో మాత్రమే వెలిగించాలి. ఇక దీపం వెలిగించే సమయంలో చాలామంది ఒకే ఒత్తి వేసి దీపం వెలిగిస్తుంటారు. ఇది పూర్తిగా అపచారం చనిపోయిన వారి దగ్గర మాత్రమే ఒకేఒత్తివేసి దీపం వెలిగిస్తారు.
ఇక చాలా మంది దీపారాధన చేసిన సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు ఇలా ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. కొవ్వొత్తి లేదా అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి.ఇక చాలామంది దేవుడికి ఎదురుగా దీపాలను పెట్టి పూజ చేస్తుంటారు ఇలా ఎదురుగా కాకుండా కాస్త ఆగ్నేయ మూలం వైపు దీపాలను పెట్టి పూజించాలి. ఇక పూజ చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల దీపం తొందరగా అర్ధాంతరంగా కొండెక్కుతుంది. ఇలా దీపం అడ్డంతరంగా కొండెక్కిన సమయంలో 108 సార్లు ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించి అనంతరం దీపరాధన చేయడం వల్ల అంతా శుభం కలుగుతుంది.