సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో ఏడాది పాటు ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి ఆలయాలకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా మరణం సంభవించిన ఆ ఇంటిలో శుభకార్యాలు కూడా చేయకూడదని చెబుతుంటారు.ఈ క్రమంలోనే ఏ ఇంట్లో అయితే మరణం సంభవించి ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకుండా పూజ సామాగ్రిని దాచి పెట్టేస్తారు.ఇలా నిజంగానే ఇంట్లో మరణం సంభవిస్తే పూజలు చేయవచ్చా చేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి శాస్త్రం ప్రకారం పూజలు చేయవచ్చా చేయకూడదా అనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారని చెబుతోంది. అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఆ ఇల్లు సకల సంపదలతో సుఖసంతోషాలతో ఉంటారని చెప్పాలి. ఇకపోతే ఒక ఇంట్లో మరణం సంభవించింది అంటే ఆ ఇంట్లో ఏడాది పాటు పూజలు చేయకూడదనే నియమం శాస్త్రంలో ఎక్కడా లేదు. మరణం సంభవించిన ఇంట్లో కేవలం 11 రోజుల పాటు మాత్రమే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకుండా ఉంటే చాలు.
11 రోజుల తర్వాత ఇంటిని శుభ్రం చేసి యధావిధిగా పూజలు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. 11 రోజుల తర్వాత ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసే పూజలు చేయవచ్చు కానీ… ఆ ఇంట్లో నూతన గృహాన్ని చేయడం పెళ్లి వంటి శుభకార్యాలను చేయకూడదు. ఇంట్లో దీపారాధన చేస్తూ నిత్యం పూజలు చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.