మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో, దేవాలయాలలో దేవుడి ముందు దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దీపాలు వెలిగించి దేవుని పూజించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని ప్రజల విశ్వాసం. అయితే మన హిందూ శాస్త్రంలో దీపం వెలిగించడానికి కూడా అనేక నియమాలు ఉన్నాయి. దీపం వెలిగించే సమయంలో ఎలాంటి నూనె ఉపయోగించాలి.. ఎన్ని వత్తులతో దీపం వెలిగించితే శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీపారాధన చేసే సమయంలో ఒక్కోరకమైన నూనెతో దీపం వెలిగించడం వల్ల ఒక్కోరకమైన ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆముదంతో దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఇంట్లో ఆముదంతో దీపారాధన చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి మనం చేపట్టిన పనులు అన్నింటిలో విజయం చేకూరుతుంది.
అలాగే మరి కొంతమంది కొబ్బరి నూనెతో దేవుడి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే మరికొంతమంది ఐదు రకాల నూనెలతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా ఐదు రకాల నూనెలు కలిపి దీపం వెలిగించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
అంతేకాకుండా మరి కొంతమంది ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగేస్తూ ఉంటారు. ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.
దీపారాధకు ఎన్ని వత్తులు ఉపయోగించాలి :
దేవుడి ముందు ఒక వత్తితో దీపం వెలిగిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సిద్ధిస్తాయి
అలాగే రెండు ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగించటం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది.
దేవుడి ముందు త్రిముఖ దీపాన్ని వెలిగిస్తే పుత్ర దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
నాలుగు ముఖాలతో కూడిన దీపం దేవుడి ముందు వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది.
ఇక పంచముఖ దీపారాధన చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి.