కాకరకాయ చేదు తగ్గడానికి, కాకరకాయను కట్ చేసి, ఉప్పుతో నానబెట్టడం లేదా పచ్చి మామిడికాయ ముక్కలు వేసి వండడం వంటి పద్ధతులను ఫాలో అవ్వవచ్చు. కాకరకాయను కట్ చేసి, ఉప్పుతో నానబెట్టడం ద్వారా చేదును తగ్గించవచ్చు. కాకరకాయ వండేటప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేయడం ద్వారా చేదు తగ్గుతుంది. కాకరకాయను పెరుగులో నానబెట్టడం ద్వారా చేదును తగ్గించవచ్చు. కూరలో మసాలా దినుసులు వాడటం వల్ల చేదు తగ్గుతుంది.
కాకరకాయ చేదు తగ్గించడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వంట వండుకోవడానికి ముందే అరగంట పాటు కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసుకొని అన్ని ముక్కలకు ఉప్పు సమానంగా చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా చేసి కొద్దిసేపు అలాగే ఉంచుకుంటే సులువుగానే కాకరకాయ చేదు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకరకాయ తినడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సులువుగా లభించే ఛాన్స్ ఉంటుంది.
కాకరకాయలను వండే సమయంలో గరుకుగా ఉండే భాగాన్ని మొదట తీసివేయాలి. కాకరకాయ గింజలను సైతం తొలగించాలి. ఆ తర్వాత కాకరకాయ గింజలను ఉప్పునీటిలో నానబెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు కాకరకాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. జీర్ణక్రియ, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి కాకరకాయ మేలు చేస్తుందని చెప్పవచ్చు.
కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇది తీసుకోవడం ద్వారా అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండే వీలు కలుగుతుంది. కాకరకాయలో క్యారెంటీన్ అనే పదార్థం ఉండగా ఈ పదార్థం మహిళల్లో మధుమేహం సమస్యలను దూరం చేస్తుంది. మహిళల్లో పిండం అభివృద్ధికి అవసరమయ్యే జింక్, ఫోలేట్, ఐరన్, పొటాషియం సహా ఇతర మినరల్స్ కాకరకాయలో సమృద్ధిగా లభిస్తాయి.