మైక్రోసాఫ్ట్, గూగుల్,సిటి గ్రూప్, కాగ్నైజాంట్, ఎల్ ఎస్ ఐ కార్పొరేషన్… ఇలా లెక్క లేనన్ని గ్లోబల్ కంపెనీలలో భారతీయ సంతతి వారు సిఇవొలుగానో, విధాన నిర్ణేతలుగానో ఉన్నారు. వీరి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ కంపెనీలు విదేశాలలోపెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారం వ్యాప్తి చేసుకోవాలన్నా వారి సలహాలు చాలా అవసరం. వాళ్లను శత్రువులుగా చూస్తే నష్టం వస్తుంది. అందుకే భారతీయ సంతతి (NRI) వారందరిని ఒకే గాట కట్టి శత్రువులుగా చూస్తే నష్టంవస్తుందని పాకిస్తాన్ కు జ్ఞానోదయం అయింది.
ఎన్ ఆర్ ఐ లు ఉన్నత స్థానంలో ఉండే కంపెనీలు పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాలంటే, అక్కడి భారతీయ అధికారులను శత్రువులుగా చూస్తే పని జరగదని, వారిపట్ల స్నేహ భావం ప్రదర్శించాలని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ సంతతివారు పాకిస్తాన్ పర్యటనకు వస్తే దేశానికి ముప్పు కాదని, అందువల్ల వారి వీసాల విషయంలో కఠిన వైఖరి మానేసి సులభంగా వీసా మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. మూడు నాలుగు వారాలలో ఇది అమల్లోకి వస్తుంది. ఈ కొత్త విధానం వల్ల ఎన్ ఆర్ ఐ లు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఇ-దరాఖాస్తు చేసుకోవచ్చు.
విదేశాలలో స్థిరపడిన భారతీయులు వారసులను కూడా పాకిస్తాన్ శతృదేశ పౌరులుగానే చూస్తూ వచ్చింది. అందుకే చాలా సందర్బాలలో భారతీయ సంతతికి చేందిన విదేశీయులకు కూడ పాకిస్తాన్ వీసా తిరస్కరిస్తూ వచ్చింది. ఇపుడా విధానానికి స్వస్తి పలికింది. వ్యాపారం, టూరిజం ను ప్రోత్సహించేందుకు భారతీయ సంతతి వారికి కూడా వీసాను సులభ తరం చేసింది. ఇక నుంచి వారు కూడా ఇ.వీసా పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్త విధానంలో భారతీయ సంతతి వారు ఆన్ లైన్ లో వీసాకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విదేశీయుల లాగానే భారతీయ సంతతి వారు కూడా ఏడు పనిదినాలలో వీసా పొందవచ్చు.
ఈ నిర్ణయం వెనక ఆర్థిక కారణాలున్నాయ. ప్రభుత్వానికి అదాయం తెచ్చేమార్గాలను విస్తృతం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో భాగంగా భారతీయ సంతతి వారిని వదలుకోరాదని నిర్ణయించింది. ‘ ఉన్నత స్థాయి మేనేజ్ మెంట్ ప్రతినిధులు మోటరోలా, గూగుల్, వంటి ప్రముఖ ఐటి కంపెనీలలో విధాన నిర్ణేతలుగా ఉండే వారు రెండో తరానికో మూడో తరానికో చెందిన ప్రవాస భారతీయలు. వారు దేశ భద్రతకు ముప్పుకాదు,’ అని పాకిస్తాన్ భావిస్తున్నదని ఆదేశ ప్రతినిధి ఒకరు ఖలీజ్ టైమ్స్ కు చెప్పారు.
పాకిస్తాన్ ప్రభత్వం దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలనుకుంటున్నది.చాలా కంపెనీలకు భారతీయ సంతతి వారు అత్యున్నత స్థాయి మేనేజ్ మెంట్ లో ఉన్నారు. సిఐవొలుగా ఉంటున్నారు. పాకిస్తాన్ లో ఈకంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే వారితో సంప్రదింపులుజరపాల్సి ఉంటుంది. అందువల్ల పాత వీసా విధానం అనుసరిస్తే ఈ కంపెనీలతో చర్చలు జరపలేరు.అందువల్ల వారితో సఖ్యంగా ఉండాల్సి ఉంటుంది.
‘భారతయ సంతతి వారికి సంబంధించి వీసా విధానంలోపాకిస్తాన్ వివక్ష పాటిస్తూ ఉంది. అంతిమంగా నష్టం కలిగిస్తూ ఉంది,’పాక్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇపుడు అమలులో ఉన్న వీసా దరఖాస్తులో రెండు బాక్స్లుంటాయి.ఇందులో ఒక దానిలో ఇపుడేదేశస్థులో చెప్పాలి. మరొక బ్యాక్స్ లో ఏదేశసంతతో వెల్లడించాలి. కొత్త విధానంలో మొదటి బాక్స్ పాకిస్తాన్ మిత్రదేశమయినపుడు రెండోబాక్స లో ఇండియా (భారత్) పట్టించుకోకుండా వీసా జారీ చేస్తారు.
‘ రెండు మూడు తరాల కిందట విదేశాలలో స్థిరపడిన భారతీయుల సంతతి వివిధ రంగాలలో నిపుణులుగా పనిచేస్తున్నారు. వారెవరూ రాజకీయంగా ప్రభావితులయిన వారు కాదు. అందువల్ల వారికి సెక్యూరిటీ సమస్య ఉండదని పాక్ రాయబారా కార్యాలయాలు కూడా నివేదికలిచ్చాయి,’ అని పాకిస్తాన్ ప్రతినిధి చెప్పారు.