హెచ్‌ 1బీ వీసా లాటరీ పద్దతే .. జో బైడెన్ కీలక నిర్ణయం !

హెచ్‌1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్‌ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు అయన ప్రకటించారు. తాజా మార్పులతో హెచ్‌ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డ్ ‌తో యూఎస్‌ లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.

విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్‌ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు.అయితే , కొత్తగా ఏర్పడిన బైడెన్ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలని కొన్నిరోజుల పాటు వాయిదా వేశారు. బైడెన్ తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకి కొంత ఉపశమనం లభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పాత పద్ధతైన లాటరీ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధానానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్వ్యవస్థ లో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కి మరింత సమయం ఇవ్వాలని జో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.