గాసిప్స్ : “ఆదిపురుష్” లో రామ్ చరణ్? ఊహించని రోల్ కూడా అట.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ అయ్యిపోయి రిలీజ్ డేట్ కూడా తెచ్చుకున్న భారీ చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటిస్తుంది.

ఇక ఇతిహాస సినిమా అంటే ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు కనిపిస్తాయి. అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్ కూడా సాలిడ్ తారాగణం ని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ వర్గాల ఓ ఊహించని గాసిప్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక సాలీడ్ కామియో కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని మేకర్స్ ఫిక్స్ చేసారని..

అంతే కాకుండా షూటింగ్ కూడా చేసారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి రామ్ చరణ్ చేసిన రోల్ కూడా మామూలుది కాదట. ప్రణవ మహా శివుడిగా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించాడని తెలుస్తుంది. అంతే కాకుండా ఒక నాలుగు నిమిషాల పాటు చరణ్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇందులో అయితే ఎంతవరకు నిజముందో కానీ ఒకవేళ నిజం అయితే బాక్సాఫీస్ బద్దలే అని చెప్పాలి. మరి దీనితో ఈ టాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుండగా ఆ అఫీషియల్ అప్డేట్ కోసం మాత్రం అంతా ఎదురు చూస్తున్నారు.