బిగ్ న్యూస్ : పాలిటిక్స్ లోకి హీరో నాగార్జున? అప్పుడే టికెట్ కూడా రెడీ..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజకీయాలు కొత్తేమి కాదు ఎప్పుడో స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగిన నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏపీలో రాజకీయాలు సినిమాలు ఏదొక అంశాలోకి కలిసే ఉంటున్నాయి. అలా రీసెంట్ గా అయితే మరింత స్థాయిలో రాజకీయాలు సినిమాలు కలిసిపోయాయి.

అయితే పాలిటిక్స్ పరంగా ఎలాంటి ప్లాన్ లు ఉంటాయో కానీ సినీ ప్రముఖులు చాలా మందే ఆయా పార్టీలకు పని చేసి ఆ పార్టీలలో ఎం పి హోదాలలో పోటీ చేస్తూ కనిపిస్తారు. అలా ఇపుడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పాలిటిక్స్ లోకి దిగబోతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.

నాగ్ ఇప్పుడు సినిమాలు బిగ్ బాస్ అని బిజీగా ఉండగా తాను పొలిటికల్ గా కూడా ప్రముఖ నేత వై ఎస్ జగన్ తో ఎప్పుడు నుంచో సాన్నిహిత్యంగా ఉన్న సంగతి చాలా మందికి తెలుసు మరి అందులో భాగంగా నాగ్ కి జగన్ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు గాను ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టుగా ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి.

అది కూడా విజయవాడ నుంచి పోటీ చెయ్యమని జగన్ చెబుతున్నట్టుగా సినీ వర్గాలు నుంచి టాక్. అయితే దీనిని ఇంకా నాగ్ అయితే ఒప్పుకోవాల్సి ఉందని మరికొందరు అంటున్నారు. మరి దీనిపై ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.