నిమ్మగడ్డ పదవీకాలాన్ని పొడిగిస్తారా?  

Will Ramesh extend his tenure?
గత అయిదారు రోజులుగా సోషల్ మీడియాలోనూ, కొన్ని వెబ్సైట్లలోనూ జరుగుతున్న చర్చ ఇది!   కారణం ఏమిటంటే గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ వలన నిమ్మగడ్డ మూడు నెలలపాటు పదవినుంచి తొలగాల్సివచ్చింది.  ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించారు.  అయితే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడంతో మళ్ళీ ఆయనను ఎన్నికల కమీషనర్ గా పునరుద్ధరించారు.  ఎన్నికల కమీషనర్ పదవీకాలం అరవై నెలలు.  మధ్యలో తనకు మూడు నెలలు గాప్ వచ్చింది కాబట్టి ఆ మూడు నెలల పదవీకాలాన్ని పరిహారం చేస్తూ జూన్ నెలాఖరు వరకు పదవీకాలాన్ని పొడిగించాలని కోర్టుకు వెళ్లాలని నిమ్మగడ్డ ఆలోచన చేస్తున్నట్లుగా కథనాలు వండి వారుస్తున్నారు.  
 
Will Ramesh extend his tenure?
Will Ramesh extend his tenure?
నిజానికి ఇది సాధ్యం అవుతుందా?  మన చట్టాల్లో, రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటు ఉందా?  ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన నలభై ఏళ్ల వయసులో ఏవో కొన్ని ఆరోపణల మీద సస్పెండ్ అయ్యాడనుకుందాము.  ఆ తరువాత అతను కోర్టుకు వెళ్ళాడు.   హైకోర్టు, సుప్రీంకోర్టు కు కూడా వెళ్లాల్సివస్తుంది.  ఓ పదేళ్ల తరువాత అతనికి అనుకూలంగా కోర్ట్ తీర్పు ఇచ్చి, సస్పెన్షన్ కాలంలో అతనికి దక్కాల్సిన జీతభత్యాలను చెల్లించాలని కోర్ట్ ఆదేశాలు ఇస్తుంది.  అంతే కాకుండా, ఆ పదేళ్ల కాలంలో అతనికి దక్కాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్, ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని తీర్పు ఇస్తుంది.  కోర్ట్ ఆదేశాలను ప్రభుత్వం అమలు చెయ్యక తప్పదు.   తనకు పదేళ్ళపాటు ఆఫీసుకు వెళ్లే అవకాశం పోయింది కాబట్టి తనకు డెబ్బై ఏళ్ళు వచ్చేవరకు పదవిలో కొనసాగే ఆదేశాలు ఇవ్వాలని సదరు ఉద్యోగి కోర్టుకు వెళ్తే అతని కోరికను కోర్టు మన్నిస్తుందా?  
 
నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు అలాంటి అవకాశం లేదని భావిస్తున్నాను.  మరి తెలుగుదేశం వారి ప్రోద్బలంతో ఇలాంటి పుకారులు షికార్లు చేస్తున్నాయా లేక నిమ్మగడ్డను నిజంగానే అలాంటి ఆలోచన ఉన్నదా అనేది ఒక అనుమానం.  దానికి చెప్పబడుతున్న కారణాలు ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు మార్చ్ నెలాఖరు లోగా పూర్తయ్యే అవకాశం లేదు.  ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అవి పూర్తవడానికి కూడా కనీసం నెలరోజులు పడుతుంది.  ఆ తరువాత కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి.  కానీ, నిమ్మగడ్డకు అంత వ్యవధి లేదు.   కొత్త కమీషనర్ వస్తే ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి చాలాకాలం పడుతుందనే సాకుతో ఆ ఎన్నికలను కూడా పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని, అందుకోసం మరో మూడు నెలలు తనకు పొడిగింపు ఇవ్వాలని నిమ్మగడ్డ కోర్టుకు ఎక్కే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  
 
విచారకరమైన విషయం ఏమిటంటే  నిమ్మగడ్డ కోరికను కోర్ట్ ఆమోదిస్తుందని చాలామంది చెప్పుకోవడం.  తెలుగుదేశం వారే కాక వైసిపి వారు కూడా కోర్టు  నిమ్మగడ్డనే సమర్థిస్తుందని భావిస్తున్నారంటే మన వ్యవస్థలు ప్రజల దృష్టిలో ఎంత దిగజారిపోయాయో అర్ధం చేసుకోవచ్చు.  ఏ కేసు అయినా సరే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటే చాలు ప్రతిపక్షానికి అనుకూలమైన తీర్పు వస్తుందని విద్యాధికులు కూడా కామెంట్స్ చేస్తున్నారంటే రాజ్యాంగం పేరుతో మన వ్యవస్థలు ప్రజలకు చాలా దూరం అయ్యాయని అర్ధం అవుతుంది.   ఒక విషయం మాత్రం స్పష్టం చేసుకోవచ్చు.  న్యాయవ్యవస్థ మరీ అంతగా దిగజారలేదు.  అమరావతి కేసులను విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరిని బదిలీ చేస్తే అమరావతి చచ్చిపోతుందని తెలుగుదేశం వారు, పచ్చ పత్రికలవారు ఎంత గగ్గోలు పెట్టినా, డ్రామాలు ప్రదర్శించినా ఆయన బదిలీ ఆగలేదు.  ఎవరో ఒక వ్యక్తి లేనంతమాత్రాన వ్యవస్థలు స్థంభించిపోవు.  కాబట్టి న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉంచాలి.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు