ఏడవలేక నవ్వడం.. ఇదీ ‘దిల్’ రాజు పరిస్థితి. ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు టిక్కెట్లు దొరకనోళ్ళు కూడా ‘వారసుడు’ సినిమాని తెలుగునాట పెద్దగా కన్సిడర్ చేయలేదు.
ఎందుకీ దుస్థితి.? అంటే, సినిమా టీవీ సీరియల్‌లా వుండటమే అన్నది మెజార్టీ అభిప్రాయం. ‘టీవీ సీరియళ్ళను తక్కువగా చూడొద్దు.. అవి చాలా గొప్పగా వుంటాయ్..’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పడంతో, ‘వారసుడు’ సినిమా మరీ అంత నాసిరకమా.? అన్న అభిప్రాయం తెలుగు జనాల్లోకి వెళ్ళిపోయింది.
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాత్రం, ‘వారసుడు’ హిట్టు సినిమానే.. అంటూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. తమిళంలో సినిమా వసూళ్ళను బాగానే రాబట్టింది. తెలుగు నాట మాత్రం భంచిక్ అయిపోయింది. ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల నడుమ ఇరుక్కుపోయి, నలిగిపోయింది.
నష్టాలు గట్టిగానే వచ్చాయంటున్నారు. ఒకవేళ హీరో విజయ్‌ని గనుక ప్రమోషన్స్‌కి తీసుకొచ్చి వుంటే, కాస్తో కూస్తో లాభం వుండేది. చివరికి రష్మిక కూడా పెద్దగా సినిమాని ప్రమోట్ చేయలేదు. ఎందుకిలా.? ఎచ్చులకుపోయి, బొక్క బోర్లా పడ్డాడు మొత్తానికి దిల్ రాజు.