‘బ్రో’ టైటిల్ వెనుక ఎవరు.?

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీకి తాజాగా ‘బ్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి మొదట డివైన్ టచ్‌తో వుండే టైటిల్ అయితే బావుండేదని అనుకున్నారట.

కానీ, క్యాచీగా వుంటుందనుకున్నారో ఏమో, ‘బ్రో’ అనే టైటిల్ ఫైనల్ చేశారు. అయితే, ‘బ్రో’ టైటిల్‌తో ఆల్రెడీ ఈ మధ్యనే అవిక గోర్, నవీన్ చంద్ర నటీనటులుగా ఓ సినిమా వచ్చింది.

ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో వుంది ఈ సినిమా. ఈ టైటిల్ ప్రచారంలో వుండగానే ఈ టాపిక్ రైజ్ అయ్యింది చూజాయిగా. కానీ, ఎందుకో పట్టించుకోలేదు. అదే టైటిల్ ఫైనల్ చేశారు.

ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం దర్శకుడు సముద్రఖని అంటున్నారు. సినిమా కథకి అనుగుణంగా ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని ఆయన పట్టుబట్టాడట.

అలా ఇదే టైటిల్ ఫైనల్ చేయాల్సి వచ్చిందట. తమిళ మూవీ ‘వినోదియ సితం’ కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో చాలా మార్పులు చేశారు. ప్రత్యేకించి త్రివిక్రమ్ చేసిన మార్పులు చాలా స్పెషల్‌గా వుంటాయట. అదీ సంగతి.