ఈ ‘పెట్రో బాంబ్’: విధ్వంసం మామూలుగా లేదు.!

This 'Petro Bomb': Destruction is not normal

కనీ వినీ ఎరుగని విధ్వంసమిది. నిజమే, ఇది ఆర్థిక విధ్వంసంగా అభివర్ణిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్రాన్ని కాపాడుతున్నది పెట్రో ఉత్పత్తులేనని అనుకోవాలేమో. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పెట్రో ధరలు పెరిగిపోతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోలు ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది. బహుశా ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త చెత్త రికార్డు సృష్టించారని అనుకోవాలేమో. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలోనే ఈ పరిస్థితి.. అన్నది కేంద్రం వాదన. కానీ, ఇప్పుడున్న క్రూడ్ ధరలతో పోల్చితే రెండింతలు.. ఆ పైన వున్నప్పుడు కూడా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే జోరు కొనసాగితే, దేశంలో లీటర్ పెట్రోలు ధర 150 రూపాయలు దాటెయ్యడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయని అనుకోలేం. ఒకవేళ తగ్గినా, ఆ తగ్గుదల మాత్రం వినియోగదారుడికి అందదు. ఎందుకంటే, కేంద్రం పన్నుల రూపంలో వాహనదారులకు వాత పెడుతుంది గనుక. ఇటీవల బడ్జెట్ సందర్భంగా ‘సెస్’ అదనంగా జోడించింది కేంద్రం.

This ‘Petro Bomb’: Destruction is not normal

అయితే, ఆ భారం వినియోగదారుడిపై పడబోదు.. అని ప్రకటించిందిగానీ.. అప్పటికి పెంచకపోయినా, అంతకు మించి ఈపాటికే పెరిగిపోయింది.. రోజువారీ ధరల సవరణ కారణంగా. ఇంతకీ, ఈ స్థాయిలో ఎందుకు పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి.? అంటే, కేంద్రానికి మరో మార్గం లేదన్నది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. కానీ, పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది. పెట్రోలు, డీజిల్.. సామాన్యులకు నిత్యావసర వస్తువుల కిందే లెక్క. ప్రత్యక్షంగా చాలామందికి సంబంధం లేకపోయినా, పరోక్షంగా ప్రతి ఒక్కరిపైనా పెట్రో భారం పడుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే, రవాణా ఛార్జీలు పెరుగుతాయి.. తద్వారా ప్రతి వస్తువు ధరా పెరుగుతుంది. బీజేపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు అర్థ రూపాయి ధర పెరిగితే నానా యాగీ చేసిన సందర్భాలున్నాయి. కానీ, ఇప్పుడు అదే బీజేపీ అధికారంలో వుంది.. అను నిత్యం.. అనూహ్యమైన రీతిలో ధరలు పెరుగుతున్నాయి. ఈ పాపం ఎవరిది.? పరిపాలించమని అధికారమిస్తే.. రాచి రంపాన పెట్టడం ఎంతవరకు సబబు.? అన్నది సాధారణ ప్రజానీకం వాదన.