ఆమ్మో సర్పంచ్ పదవా! వైరలయిన తెలంగాణ సర్పంచ్ గోడు

 సర్పంచ్ ఎన్నికలొచ్చాయి. అట్టహాసంగా ఏర్పాట్లుజరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు బాగా ఖర్చు పెట్టుకునేందుకు వీలు కల్పిస్తూ చట్టం అవకాశం కల్పించింది. అయితే, గెల్చాక సర్పంచ్ జీవితం   ఎలా గుంటుందో చెప్పే ఈ రైటప్ పాతదే గాని , తెగ వైరలవుతూ ఉంది. మీరూ చదవండి….

చిన్న గ్రామపంచాయతీ అయితే 5 లక్షలు పెద్ద గ్రామపంచాయతీ అయితే 20 లక్షలు ఖర్చుపెట్టి సర్పంచ్ గా గెలిచాక ఆవ్యక్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కి ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అరా కోర నిధులతో బుగ్గలు(వీధి దీపాలు) వేయడం,చెడిపోయిన బోర్ లనూ రిపేర్ చేయడం, ఉన్న నిధులతో సీసీ రోడ్ వేయడం అదనంగా బోర్లు వేయించడం మోరీలు తీయడం…

రాష్ట్ర ప్రభుత్వం నుండి అభివృద్ధికి నిధులు రాక పొద్దుగాల 6 గంటలకు లేసి తయారు అయ్యి…

MLA గారింటికి పోయి రాత్రి పది దాకా MLA గారు ఏ ఊరికి ప్రోగ్రామ్ ఉంది అంటే ఆ ఊరికి పోయి రోజు మొత్తం ఛాయల మీద,సమోసల మీద బతికి రాత్రి పదింటికి ఇంటికి వచ్చి బుక్కె డంత బువ్వ తిని మళ్ళీ తెల్లారి లేచి మల్ల గట్లనే పొంగ పొంగ MLA అబ్బా

*ఈ సర్పంచ్ మనోడే మన వర్గమే మన అభిమానే అని ఏ రెండు ఏండ్లకో,మూడు ఏండ్లకో ఒక్క పని ఇస్తే దానికి DE(3%),AE(5%) (EE) 2% అన్నీ ఐయినక ఎం బి తీసుకోని గ్రామ కార్యదర్శి కి చెక్ కొరకు పొతే 3% నుంచి 6% వరకు డిమాండ్ చేసి తిoపి తిoపి పై పర్సంటెజి తీసుకోని చెక్ రాసుకొని ఎస్ టి ఓ కు పొతే దానికి ప్రీజింగ్ ఎప్పుడు వస్తాయో తెలువదు,

కమిషన్ ఇచ్చి ఒక్క పని సీసీ రోడ్ లేదా ఇంకా ఏదైనా చిన్న పని ఇస్తే దానికి పైసలు బయట నుండి రెండు రూపాయలు కోన్ని గ్రామాల్లో అయితే రూ 5 కు మిత్తికి తెచ్చి ఆ పని చేపించినాక ఆ పని మొత్తం అయ్యాక ఆ పని పైసల కోసం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఏ యడాదికో వాడిని,వీడిని బతిలాడి చేసిన పని పైసలు మంజూరు చేస్కొని మిత్తి తెచ్చిన కాడా కట్టంగా సర్పంచ్ కి మిగిలేది ఎం లేదు

*ఇక 5 ఏళ్లలో వచ్చే పండగల కు తెల్లారి ఎవరు ఏమీ అడుగు తారో తేలది,సచ్ఛిన సర్పంచ్ బతికినా సర్పంచ్ బార్య భర్తలు కోట్లాడుకోనైనా సర్పంచ్ పండుగలకు లైట్లు,కనీస వసతులు ఏర్పాటు చేపించడం కోసం జేబుల నుండి సొంత పైసలు తీసి పెట్టడం వాటికి సంబంధించిన బిల్ వస్తే తీసుకోవడం లేకపోతే వదిలెయ్యడం.

తర్వాత ఊరిలో ఉన్న సర్పంచ్ వ్యతిరేక వర్గం వాళ్ళు చేసే తీట పనులు అనగా సర్పంచ్ ల మీద యస్సి. యస్టీ కేసులు పెట్టించడము.వీధి దీపాలు పగల గొట్టడం,నల్లాల బావి మోటార్ కాలబెట్టడం …

బజారులో మంచి మోరం పోయలేదని పిర్యాదు చేయడం లాంటివి వల్ల వాటికి కూడా జేబుల నుండి సొంత పైసలు తీసి పెట్టడం మళ్ళీ రాత్రి ఎవడో ఒకడు తాగి వచ్చి కావాలని సర్పంచ్ ని కుక్క బూతులు తిట్టడం ఇవన్నీ భరిస్తూ…

ప్రభుత్వం నుండి పైసలు రాక భూమి ఉన్నోడు భూమి అమ్ముకొని, భూమి జాగా ఆస్తులు లేని వాడు ఎం పని చేస్తలేడు అని జనం చేతిలో తిట్లు తినుకుంటు బతుకుతున్నారు…

సర్పంచ్ లు మీకు కోటి సలాంలు…
ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ సర్పంచ్ లరోజు వారి 5 ఏళ్ల జీవితం
పరిస్తితి ఇలాగే ఉంటే యువత రాజకీయాల్లోకి ఎలా వస్తది వ్యవస్ధలో మార్పు ఎలా తెస్తాది…

డబ్బులు తీస్కొనిది జనం ఓటు వెయ్యరు

కమిషన్ తీస్కొనిది , DE, AE EE ఎంబీ ఇవ్వరు ఎంబి తెచ్చినంక గ్రామ పంచాయతి కార్యదర్శి కౌoటర్ సిగ్నేచర్ చెక్ పైన పెట్టాలంటే 2% నుంచి 6% వరకు ఇవ్వాలి..

గిసొంటి పరిస్తితిలు పెట్టుకొని ఎలా ఒక ఆత్మభిమానం ఉన్న ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లోకి రాగలడా..?

*ఇది ప్రస్తుతం రచ్చబండ వద్ద పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నాయకుల నోట మాటలు..లోకం పోకడ.