అస్సలేమాత్రం సూట్ అవని కాంబినేషన్ అది. రవితేజ ఏజ్ ఏంటి.? శ్రీలీల ఏజ్ ఏంటి.? చాలా జుగుప్సాకరంగా వుంది ఆ కాంబినేషన్.! ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ‘ధమాకా’ సినిమా టైమ్లో.
మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.! అది కూడా మైత్రీ మూవీస్ పతాకంపై. గోపీచంద్ మలినేని దర్శకుడు. ‘వద్దు, సీనియర్ హీరోలతో సినిమాలు చేయొద్దు..’ అని శ్రీలీలకు ఆమె అభిమానులు సూచిస్తున్నారు.
కానీ, శ్రీలీల తనకు అలాంటి అభ్యంతరాలేమీ లేవని చెబుతోంది. పైకి అలా చెబుతున్నా, లోలోపల కొంత ఇబ్బందిగానే వుందామెకి.! కేవలం ఆబ్లిగేషన్ మీదనే శ్రీలీల ఈ కాంబోకి ఒప్పుకుందన్నది ఇన్సైడ్ సోర్సెస్ రిపోర్ట్.
అయినా, రవితేజ ఇలా ఎందుకు చేస్తున్నాడు.? యంగ్ హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్.. అదీ చాలా ఎబ్బెట్టుగా.! వై దిస్ కొలవెరి.?