రష్మిక స్టార్‌డమ్‌కి ఎసరుపెట్టిన శ్రీలీల.!

సినీ పరిశ్రమలో సక్సెస్ చుట్టూనే అవకాశాలు తిరుగుతుంటాయ్. సక్సెస్ ఫార్ములా చుట్టూ సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. సక్సెస్ కొట్టిన దర్శకుడు, సక్సెస్ కొట్టిన హీరో, సక్సెస్ కొట్టిన హీరోయిన్.. ఇలా సక్సెస్ చుట్టూనే అంతా. కమెడియన్ల విషయంలోనూ, సంగీత దర్శకుల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది.

ఇక, ఇప్పుడు శ్రీలీల శకం ప్రారంభమైంది తెలుగు సినీ పరిశ్రమలో.. అని అంతా చర్చించుకుంటున్నారు. ఇది మరీ టూమచ్ కదా.? అయినాసరే, అదే నిజం. ‘ధమాకా’ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం శ్రీలీలకు ఇచ్చేస్తున్నారంతా. దాంతో, శ్రీలీలకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.

నిజానికి, శ్రీలీల చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలే వున్నాయ్. అయినాగానీ, ఆమె డేట్స్ ఖాళీగా వున్నాయా.? లేదా.? అన్నదాంతో సంబంధం లేకుండా, నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆమె వెంట పడుతున్నారట.

ఇక, రష్మిక మండన్నకి శ్రీలీల రూపంలో గట్టి పోటీ తప్పదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. రష్మిక ఔట్, శ్రీలీల ఇన్.. అని కన్నడ సినీ అభిమానులు, శ్రీలీల టాలీవుడ్ భవితవ్యం గురించి మాట్లాడుకుంటోంటే, మన తెలుగమ్మాయ్ కదా.. శ్రీలీలకి అంతకు మించిన క్రేజ్ ఇక్కడ వుండదా.?

రష్మిక హిందీ, తమిళ సినిమాలతో బిజీ అవడంతో.. ఆమె ప్లేస్‌ని శ్రీలీల దాదాపుగా ఇక్కడ ఆక్యుపై చేసేసినట్లేనేమో.! రష్మిక చేయాల్సిన ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీలీల చేతిలో పడింది. డిటెయిల్స్ వెరీ సూన్.!