‘కల్కి’ సినిమా ఎక్కడిదాకా వచ్చింది.? ‘రాజా సాబ్’ పరిస్థితేంటి.? ప్రభాస్ అభిమానుల్ని ఒకింత చికాకు పెడుతున్న ప్రశ్నలివి. ముక్కీ మూలిగీ ‘సలార్’ ఎలాగోలా వచ్చేసింది. ప్రభాస్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారుగానీ, ప్రభాస్ స్థాయి సినిమా కాదంటూ ప్రభాస్ అభిమానులే గుస్సా అవుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
వెంటనే ‘కల్కి’ సినిమా వచ్చేస్తే ఎంత బావుండేది.? ‘రాజా సాబ్’ విషయంలో తొందరపాటు అస్సలు వద్దు.! ఇలా ప్రభాస్ అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ అభిమానులు గర్వపడే సినిమా తీస్తున్నానని అంటున్నాడు దర్శకుడు మారుతి. ఏమో, ఎవరిలో ఏ హిడెన్ టాలెంట్ వుందో చెప్పలేం. అందుకే, మారుతిని తక్కువ అంచనా వేయకూడదు.!
కానీ, ప్రభాస్ నుంచి అతని అభిమానులు ‘అంతకు మించి’ ఆశిస్తారు. అదే అసలు సమస్య. ‘బాహుబలి’ స్థాయి సినిమా కావాలి ప్రభాస్ అభిమానులకి. ‘కల్కి’ విషయంలో నమ్మకాలు సడలిపోతున్నాయ్. ‘సలార్-2’ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు.
ఇంతకీ, ప్రభాస్ చేతిలో ఏమీ లేదా.? అంటే, నిజంగానే ఏమీ లేదట. దర్శకుడు, నిర్మాత సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రభాస్ నుంచి పూర్తి కమిట్మెంట్ వుంటుందనీ, ఆయా చిత్రాల దర్శకులు, నిర్మాతలే గందరగోళంలో పడుతూ, ప్రభాస్ కెరీర్‌తో ఆడుకుంటున్నారనీ ఓ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. నిజమేనా.?